త్వరగా కోలుకుంటున్నాడు.. గట్టి పట్టుదల ఉంది

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు సహా అభిమానులు ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తున్న సంగతి తెలిసిందే. బైక్ యాక్సిడెంట్ అయిన తరవాత అతడికి అపోలో ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించడంతో వేగంగా కోలుకుంటున్నాడని తెలిసింది.

ఇదే విషయాన్ని సాయి తేజ్ స్నేహితుడు థమన్ వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి సరదాగా ఆటలాడుతూ కనిపిస్తున్న ఓ ఫోటోని థమన్ షేర్ చేసి.. తేజ్ ను `నంబన్` అంటూ సంబోధిస్తూ త్వరగా కోలుకుంటున్నాడు.. తనకు గట్టి పట్టుదల ఉంది.. అని థమన్ వ్యాఖ్యానించారు. అతడు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెరీర్ ఆరంభం నుంచి థమన్ తో సాయి తేజ్ కి స్నేహం ఉంది. ఆ ఇద్దరూ కలిసి పలు చిత్రాలకు పని చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అని తెలియగానే థమన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న సాయి తేజ్ ని రెగ్యులర్ గా కుటుంబ సభ్యులు విజిట్ చేస్తున్నారు.
× RELATED డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన కోట పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ
×