'అఖండ' చివర్లో హడావుడి!

నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా ను దసరాకు విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం గోవాలో కీలక షెడ్యూల్ నడుస్తోంది. ఈ వారం చివరి వరకు గోవా షెడ్యూల్ ను ముగించి ఆ వెంటనే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుపబోతున్నారు. బోయపాటి శ్రీను మరియు బాలయ్యల కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా మరియు లెజెండ్ లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అఖండ సినిమా హ్యాట్రిక్ ను దక్కించుకుంటుంది అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న అఖండ సినిమాను దసరాకు విడుదల చేయాలని భావించినా కూడా విడుదల సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అఖండ సినిమా ను కరోనా కారణంగా మెల్లగా తెరకెక్కిస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకుంటే స్పీడ్ గా చిత్రీకరణ ముగించాల్సి ఉంటుంది. ఈనెల చివరి వరకు షూటింగ్ ను ముగిస్తే తప్ప విడుదల సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యం అయినా లేదంటే షూటింగ్ కాస్త అటు ఇటు అయితే విడుదల కష్టం అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి ఇన్నాళ్లు మెల్లగా షూటింగ్ ను చేస్తూ వచ్చిన బోయపాటి దసరాకు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో హడావుడిగా షూటింగ్ ను చేస్తున్నారనే టాక్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ నెల చివరి వరకు షూటింగ్ పూర్తి అయితే దసరా వరకు విడుదల సాధ్యమా అనేది కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అఖండ సినిమా దసరాకు వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో మేకర్స్ హడావుడిగా షూటింగ్ జరుపుతున్నారు. ఒక వేళ దసరాకు కనుక విడుదల సాధ్యం కాకుంటే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేయాల్సి రావచ్చు అంటున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట.. రాధే శ్యామ్.. భీమ్లా నాయక్ ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. దసరా మిస్ అయితే తప్పని పరిస్థితుల్లో సంక్రాంతికే రావాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
× RELATED `లవ్ స్టోరి` ప్రీరిలీజ్ బిజినెస్ ఆ రేంజులో`
×