1000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ ఓనర్ కూతురు హీరోయిన్ గా

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `దిల్ బెచారా` నటి సంజనా సంఘీ గుర్తుంది కదూ..! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం `దిల్ బెచారా`వీలో సంజనా సంఘీ పేషెంట్ గా నటించి తనదైన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా `రాక్ స్టార్` మూవీతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన సంజనా హిందీ మీడియం- ఫక్రే రిటర్న్స్ చిత్రాల్లో నటించింది. సంఘి బ్యాక్ గ్రౌండ్ అప్పట్లో చర్చకు వచ్చింది. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ ఓనర్ సందీప్ సంఘీ కూతురు అయిన సంజనా అనుకోకుండానే నటిగా మారింది.

ప్రముఖ ట్యాలెంట్ మ్యానేజర్ ముఖేష్ చాబ్రా కంట్లో పడిన సంజన `దిల్ బెచారా`లో నటించే ఛాన్స్ని కొట్టేసింది. ఈ చిత్రంలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. అదే సంజనా సంఘీ పాలిట వరంగా మారి ఆమెని నటిగా పాపులర్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి `ఓమ్ ది బాటిల్ విత్ ఇన్` మూవీలో నటిస్తోంది. కపిల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ చిత్రీకరణ దశలో వుంది.

ఇదిలా వుంటే తాజాగా ఈ 25 ఏళ్ల సంజన ఓ త్రోబ్యాక్ హాట్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాల్దీవ్స్ లో తను వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన వీడియో అది. బ్రైట్ ఆరెంజ్ బికినీ ధరించి సంజన వాటర్ బైక్ పై చేసిన రచ్చ మామూలుగా లేదు. కూల్ బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని హోయలు పోతూ బీచ్ ని హీటెక్కించేసింది సంజన. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

ఆమె మచ్చలేని నో మేకప్ మేని ఛాయని సంపూర్ణంగా టోన్డ్ బీచ్ బాడీని ప్రదర్శిస్తూ చల్లని నల్ల సన్ గ్లాసెస్ తో తన ఒరిజినల్ రూపాన్ని చూపించింది. అంతే కాకుండా దీనికి ఆమె క్యాప్షన్ ఇచ్చింది `ఇప్పటికే మిస్సింగ్.. నేను ఇంత వ్యర్ధ శిశువుగా ఎప్పుడూ చూడలేదు`. అని పోస్ట్ చేసింది.× RELATED `లవ్ స్టోరి` ప్రీరిలీజ్ బిజినెస్ ఆ రేంజులో`
×