పవన్ సినిమాతో క్రేజీ నిర్మాతల జాబితాలో చేరిపోయాడు

ఈమద్య కాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థల పేర్లలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒకటి అనడంలో సందేహం లేదు. రాధాకృష్ణ(చినబాబు) వెనుక ఉండి నడిపిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ కు అఫిషియల్ నిర్మాతగా నాగ వంశీ వ్యవహరిస్తున్నారు. ఆయన చిన్న పెద్ద సినిమాలను బ్యాలన్స్ చేస్తూ వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వరుసగా సక్సెస్ లను దక్కించుకోవడంతో పాటు మంచి కాన్సెప్ట్ లను మంచి దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు అనే టాక్ ను దక్కించుకోవడం జరిగింది. సూర్య దేవర నాగవంశీ పేరు కూడా సినిమా సినిమాకు మరింతగా ఫేమస్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న భీమ్లా నాయక్ కు ఈయనే నిర్మాత అవ్వడం వల్ల పేరు మారు మ్రోగి పోతుంది.

త్రివిక్రమ్ మరియు రాధాకృష్ణ లకు సన్నిహితుడిగా పేరున్న నాగవంశీ ముందు ముందు మరిన్ని మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ తో పాటు పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. కొన్ని సినిమాలను ఇతర నిర్మాతల భాగస్వామ్యంతో నిర్మిస్తూ ఉండగా మరి కొన్ని సినిమాలను సొంతంగానే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిన్నా పెద్ద సినిమాలు కలిపి నాగవంశీ వరుస సినిమాలను విడుదలకు సిద్దం చేస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో ఉన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ లో రాబోతున్న భీమ్లా నాయక్ సక్సెస్ అయితే నాగ వంశీ క్రేజీ నిర్మాతగా మారడం ఖాయంగా కనిపిస్తుంది.

భీమ్లా నాయక్ విషయంలో నాగవంశీ చాలా వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో అదుపులో ఉంటూనే సినిమాకు క్రేజ్ ను పెంచేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నాడు. మొత్తానికి నాగవంశీ నిర్మాతగా ఇప్పటి వరకు ఎక్కువ శాతం సక్సెస్ లు ఉండటంతో ఆయన ముందు ముందు మరిన్ని మంచి సినిమాలను నిర్మిస్తాడనే నమ్మకంను హీరోలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన బ్యానర్ లో నటించేందుకు యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండస్ట్రీలో సితార ఎంటర్ టైన్మెంట్స్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది. స్టార్ నిర్మాతలు దిల్ రాజు.. అల్లు అరవింద్.. సురేష్ బాబు మరి కొందరి సరసన ముందు ముందు నాగవంశీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.× RELATED 'లవ్ స్టోరీ' మీదనే ఇండస్ట్రీ ఆశలన్నీ..!
×