సైదాబాద్ రేప్ కేస్ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఇటీవల ఓ ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ప్రతిపక్షాలు నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆరేళ్ల బాలికను చంపిన మరుక్షణం నిందితుడు పరార్ అయ్యాడు.

సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామని ప్రకటించారు.

నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 9490616366 నంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోలీసులు ఇంతమొత్తంలో రివార్డ్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఇదే అత్యధిక రివార్డ్ అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయినా నిందితుడు రాజు ఆచూకీ తెలియరాలేదు.

ఈ నేపథ్యంలోనే నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డ్ ప్రకటించారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అంటూ టాటూ ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
× RELATED గుజరాత్ లో పట్టుబడిన 15000 కోట్ల డ్రగ్స్ కథేంటి?
×