ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉద్యోగులను బదిలీపై ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. క్రమశిక్షణ చర్యలు విజిలెన్స్ కేసులు పెండింగులో ఉన్న వారికి మాత్రం ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే శాశ్వత బదిలీల కోసం పాటించాల్సిన నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంతోపాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు బదిలీ కోసం వచ్చే నెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని పలువురు ఉద్యోగులు అధికారులు ఏపీకి వెళ్లేందుకు తమను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొదట్లో డిప్యూటేషన్ అంతరాష్ట్ర బదిలీల కొంద కొందరినీ ఏపీ ప్రభుత్వం అనుమతించింది.

తాజాగా సీఎం కేసీఆర్  అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి వారి శాశ్వత బదిలీకి ఆమోదం తెలిపారు.  అందుకు అనుగుణంగా సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీకి వెళ్లాలనుకునే ఉద్యోగులు తమ శాఖల్లో వచ్చే నెల 15లోగా శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని శాఖాధిపతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది.  సంబంధిత శాఖాధిపతి సిఫారసుతో ఉద్యోగి పనిచేసే శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం పంపించాలి.
× RELATED పవన్ గాలి తీసిన సీపీఐ నారాయణ
×