స్టాలిన్ సంచలన నిర్ణయం..వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం

తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన నిర్ణయాలతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. అధికారంలోకి వచ్చిందే తడువు ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా తీసుకుంటున్న  స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా తాజాగా పోలీసులపై వరాల జల్లు కురిపించారు స్టాలిన్. పోలీసులు ఇకపై తాము పనిచేస్తున్న జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో వేలాది మంది పోలీసులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. చెన్నైలోని థౌజెండ్ లైట్స్ ప్రాంతంలో రూ.275 కోట్లతో పోలీస్ క్వార్టర్స్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. అదేవిధంగా రిస్క్ అలవెన్స్‌ను రూ.800 నుంచి రూ.1000 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్న స్టాలిన్…. పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నకానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లకు వారం రోజులపాటు అదనంగా సెలవులు మంజూరు చేశారు. అలాగే ఇకపై ఏటా ఉచితంగా పనిచేస్తున్న పోలీసులతో పాటుగా వారి భార్యలకు కూడా ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

శాసనసభలో సోమవారం ఉదయం పోలీసుశాఖకు సంబంధిం చిన ఆర్థిక పద్దులపై ఆయన ప్రసంగిస్తూ ఆ శాఖకు సంబంధించి అరవై ప్రకటనలు చేశారు. ముఖ్యంగా పోలీసులకు అంది స్తున్న రిస్క్ అలవెన్స్‌ను రూ.800 నుంచి రూ.1000లకు పెంచుతున్నామన్నారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న 1132 మంది పోలీసు వారసులను కారుణ్య ప్రాతిపదికన వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియ మించనున్నామని పేర్కొన్నారు. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు రూ.25లక్షలతో ప్రత్యేక యాప్ ను రూపొందించనున్నట్టు తెలిపారు.

చెన్నై థౌజండ్ లైట్స్ ప్రాంతంలో రూ.275 కోట్లతో పోలీసు క్వార్టర్స్ ను నిర్మించనున్నామని ఆవడి తాంబరం కార్పొరేషన్లలో కొత్త పోలీసు కమిషనర్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నామని సీఎం ప్రకటించారు. పోలీసు క్యాంటీన్లలో విక్రయిస్తున్న వస్తువులపై జీఎస్టీని మిన హాయించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల పదోన్నతికి కాలపరిమితిని నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని మెరీనాబీచ్ లో ప్రత్యేక ప్రాణ రక్షక దళం ఏర్పాటు చేస్తామని రాష్ట్రంలో కొత్తగా పది పోలీసులస్టేషన్లను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

డీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి రోజైన ఈనెల 15వ తేదీనయావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 700 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. మాజీ ముఖ్య మంత్రి జయలలిత మృతి కేసులో వాస్తవాలను కనుగొనేందుకు తమ ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడు తుందని జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ విచారణ పూర్తయి న తర్వాత ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించి వాస్తవాలను బయటపెడతామని ప్రకటించారు.
× RELATED గుజరాత్ లో పట్టుబడిన 15000 కోట్ల డ్రగ్స్ కథేంటి?
×