ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ద్వారా కనీసం ప్రైవేటు రంగంలో అయినా ఉద్యోగాలు వస్తాయని  ఎదురుచూశామని.. కానీ గత పాలకులు  ఒక లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం.. ‘ఓటుకు కోట్లు’ కేసు కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితి కనిపించింది అని జగన్ విమర్శించారు.

అప్పటి  కేంద్రప్రభుత్వంలో ఇదే గత ప్రభుత్వ పెద్దలందరూ  రెండు మంత్రి పదవులు కూడా అనుభవించారని జగన్ ఆరోపించారు. హోదా కోసం అవకాశం ఉన్న రోజుల్లో వాళ్లు రాజీపడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వానికి హోదా ఇవ్వాలని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి.. లోక్ సభలో వాళ్లకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఈరోజు మనం పదేపదే అడగడం తప్ప చేయలగలిగిన  ఏమీ లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడి దయతో ఈ పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నామని సంపూర్ణంగా నమ్ముతున్నామని.. మనకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నానని జగన్ అన్నారు.

 

× RELATED సెకండ్ వేవ్ బాధితులు.. ఇప్పుడు ఆసుపత్రులకు పరుగు.. కొత్త రోగమే కారణం!
×