మొదటి సినిమా కోసం 35 కేజీల త్యాగం

హీరోయిన్ గా పరిచయం అయ్యేందుకు బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. ఇండస్ట్రీలో రాణించాలంటే ఖచ్చితంగా పట్టుదల ఉండాలి. కష్టపడే వారికి మాత్రమే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. బ్యాక్ గ్రౌండ్ వల్ల ఇండస్ట్రీలో ఎంట్రీ అయితే ఈజీగా దక్కుతుంది కాని సక్సెస్ మరియు స్టార్ డమ్ అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడితే తప్ప స్టార్ లు అవ్వరు. స్టార్ కిడ్స్ కూడా స్టార్స్ గా గుర్తింపు దక్కించుకోవాలంటూ కష్టపడాల్సి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటింది. ఆమె హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.

సోనమ్ కపూర్ 14 -15 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో హార్మోన్ సమస్య తో అనారోగ్యంను ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె బరువు విపరీతంగా పెరిగింది. వయసు పెరుగుతున్నా కొద్ది ఆమె బరువు పెరుగుతూ వచ్చింది. సినిమాలపై విపరీతమైన ఇష్టం ఉన్న సోనమ్ కపూర్ పెరిగిన బరువు తగ్గితే తప్ప హీరోయిన్ గా ఎంట్రీ అవకాశం లేదు. దాంతో రెండేళ్ల పాటు కష్టపడి ఏకంగా 35 కేజీల బరువును తన నుండి త్యాగం చేసింది. బరువు తగ్గడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డైట్ తో పాటు వర్కౌట్ ల విషయం లో తన తల్లి ఎంతో తనకు హెల్ప్ గా నిలిచిందని సోనమ్ కపూర్ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

బరువు తగ్గి సావరియా సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా బరువు విషయంలో ఆందోళన పడిందే లేదు. ఆమె కెరీర్ మొత్తం సాఫీగా సాగి పోతూ వచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు కొన్ని పాత్రకు ప్రాముఖ్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్న ముద్దుగుమ్మ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు.
× RELATED అయ్యో కంగన ఎంత పని జరిగింది? వీళ్లింతే!
×