సన్నబడ్డ కిమ్ .. కారణం అదేనా ?

ప్రపంచ నియంతగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి కిందటి ఏడాది రకరకాల పుకార్లు వెలుగులోకి వచ్చాయి. ఒకానొక టైంలో కిమ్ చనిపోయాడనే పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే వారం తిరగక ముందే మీడియా ముందు ప్రత్యక్షమై ఆ వార్తలకి  తాను నిక్షేపంగా ఉన్నానని శత్రు దేశాల గట్టి సందేశం పంపాడు కిమ్. ఇక కిమ్ సన్నబడ్డాడనే తాజా వార్త.. అతని ఆరోగ్య స్థితిపై పలు సందేహాలకు తావిస్తోంది. చాలా కాలం తర్వాత సోమవారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బయటకు వచ్చాడు. కీలకమైన ఆర్థిక సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతో హాజరయ్యాడు.

ఆ భేటీ ఫొటోలు దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా బయటకు పొక్కాయి. అయితే అందులో కిమ్ రూపం చాలా మారిపోయి ఉంది. ముఖం మెడ చేతులు ఛాతీ భాగం సన్నబడిపోయి.. కొంచెం మార్పు కనిపిస్తోంది. దీంతో ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకే కిమ్.. సర్జరీ చేయించుకున్నాడని అందుకే ఇన్నాళ్లు బయటకు రాలేదని సియోల్ స్పై ఏజెన్సీలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఇక కిమ్ చేతికి ఉన్న 12 వేల డాలర్ల విలువ చేసే స్విస్ వాచ్ అందులో ఉంది కిమ్ అనే నిర్ధారిస్తున్నాయని సియోల్ మీడియా హౌజ్లు ప్రముఖంగా ప్రచురించాయి. పోయినేడాది జులైలో ఓ మీటింగ్కు అటెండ్ అయిన కిమ్ అదే వాచ్ ధరించాడు. ఇప్పుడు అదే వాచ్తో మరోసారి కనిపించాడు. అందుకే అది ముమ్మాటికీ కిమ్ అనేది సియోల్ పత్రికల కథనం.

అయితే సియోల్ కే చెందిన కవూహపన్ అనే దినపత్రిక మాత్రం ఆసక్తికరంగా ఒక కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో కిమ్ అధికారంలోకి వచ్చే నాటికి 90 కేజీల బరువు ఉన్నాడు. ఆ తర్వాత 2019 నాటికి మరో 50 కేజీల దాకా పెరిగాడు. కిమ్ ఫ్యామిలీలో స్థూలకాయం సమస్య వారసత్వంగా వస్తోంది. ఆ కుటుంబంలో చాలామంది గుండెపోటుతో చనిపోయారు. పైగా కిమ్ విలాసాలకు అలవాటుపడ్డ మనిషి. హెల్త్ కేర్ పట్టించుకోడు. చైన్ స్మోకింగ్ విపరీతంగా మాంసాన్ని తింటాడు. వీటికి తోడు కిందటి ఏడాది  నుంచి కిమ్ లేకుండానే పవర్ఫుల్ పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్లు నిర్వహించుకుంటోంది. భార్య ముగ్గురు పిల్లలకు(చిన్నవాళ్లే) దూరంగా 38 ఏళ్ల కిమ్ ఒంటరిగా ఉంటున్నాడనే కథనాలు వెలువడ్డాయి. ఈ అనుమానాల నడుమ కిమ్ సడన్గా ప్రత్యక్షం కావడం సన్నబడ్డ లుక్ తో దర్శనమివ్వడంలో బాడీ డబుల్ కి ఆస్కారం లేకపోలేదని కథనం ప్రచురించింది. కిందటి ఏడాది కిమ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వచ్చాక మిలిటరీ సమావేశానికి హాజరైన కిమ్ రూపంపై అమెరికా నిఘా ఏజెన్సీకి బోలెడు అనుమానాలు ఉన్నాయి.
× RELATED సర్పంచ్ తో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారిద్దరి సంభాషణ ఎలా సాగిందంటే?
×