ఒక్క హీరో.. వెయిటింగ్ లో వెయ్యి కోట్ల సినిమాలు

గత ఏడాది ఆరంభంలో మొదలైన కరోనా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. కేలండర్ మారినా కూడా పరిస్థితులు మాత్రం మారలేదు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచిందే లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు నెలలు ఒక మోస్తరుగా నడిచినా ఇరత రాష్ట్రాల్లో ఆ మాత్రం కూడా నడిచిందే లేదు. దాంతో ఎన్నో సినిమాలు విడుదల ముందు నిలిచి పోయాయి. కొన్ని పదుల సినిమాలు విడుదల కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ అయినా కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లు ఓపెన్ కోసం ఎదురు చూస్తున్నాయి. దాంతో ఒక్కో హీరో రెండు మూడు సినిమాలు విడుదలకు రెడీ చేసి పెట్టాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం ఏకంగా అరడజను సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. వచ్చే నెల లేదా ఆ తర్వాత నెల ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అయితే అప్పుడు వెంటనే సినిమాలను వదలడానికి అక్షయ్ సిద్దంగా ఉన్నాడు. ఇప్పటికే ఒకటి రెండు ఓటీటీ దారి పట్టినా మిగిలిన సినిమాలు థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు మరియు ఒకటి రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కలిపి వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉందంటున్నారు.

అక్షయ్ కుమార్ నటించిన సినిమాల్లో సూర్య వంశీ మొదలుకుని బెల్ బాటమ్.. ఆత్రంగి.. బచ్చన్ పాండే.. రక్షా బంధన్ ఇంకా రామ సేతు ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్షయ్ కుమార్ సినిమా అంటే మినిమం గా రెండు వందల కోట్ల వసూళ్లు ఖాయం. కనుక ఈ సినిమాలు అన్ని కలిపి వెయ్యి కోట్లకు పైగా నే రాబట్టడం ఖాయం అంటున్నారు. రెండు మూడు సూపర్ హిట్ లు అయితే ఈ మొత్తం రూ.1500 కోట్లు గా ఉండే అవకాశం ఉందంటున్నారు. అక్షయ్ కుమార్ తో పాటు ప్రభాస్ సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి. ప్రభాస్ కూడా వెయ్యి కోట్ల సినిమాలతో రెడీ అవుతున్నాడు.
× RELATED అయ్యో కంగన ఎంత పని జరిగింది? వీళ్లింతే!
×