తెలుగమ్మాయిని తెలుగులో ఛాన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నాను: యంగ్ హీరోయిన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారని.. అందుకే వారికి అవకాశాలు సరిగా రావు అనేవారు. ఒకవేళ అవకాశం వచ్చినా గ్లామర్ షో చేయలేక లైట్ తీసుకునేవారు అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితి అలా లేదు. కొన్నేళ్లుగా పూర్తిగా మారిపోయింది. తెలుగు అమ్మాయిలు కూడా సరైన అవకాశం వస్తే సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ముంబై నుండి పిలిపించే అందగత్తెలను కూడా బీట్ చేయడానికి వారి తెలుగు బ్యూటీలు అందాలకు మెరుగులు దిద్దుతున్నారు. అలా ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటోంది తెలుగు భామ ఈషా రెబ్బా.

ఈషా తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ అశ్విన్ జంటగా తెరకెక్కిన 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో అడుగుపెట్టింది. ఇక ఫస్ట్ మూవీలోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని మెల్లగా అవకాశాలు దక్కించుకుంటుంది. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 6ఏళ్లు దాటినా ఈషా కెరీర్ మెల్లగానే సాగుతుంది. అందంతో పాటు అభినయం ఉన్న ఈ తెలుగు అందం తనకు వచ్చిన సినిమాలు చేస్తూ వెళుతుంది. ఆ విధంగానే బందిపోటు అమితుమీ సినిమాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఈషాకి బెస్ట్ క్యారెక్టర్ పడలేదని చెప్పాలి. తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ మధ్యలో తమిళనాట కూడా ట్రై చేసింది. మొన్నటివరకు గ్లామర్ షోకు హద్దులు పెట్టుకుంది.

కానీ ఇప్పుడు ఆ హద్దులన్నీ చెరిపేసింది. ఆఫర్ల కోసం దేనికైనా సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదనే విషయం పై స్పందించింది. "తెలుగు ఇండస్ట్రీలో లోకల్ టాలెంట్ ప్రోత్సాహించాలి అంటూ.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఎందుకు రావడం లేదో నాకు కూడా తెలియదు. కానీ తెలుగులో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రశ్నను మీడియా వారు దర్శకనిర్మాతలకు అడగాలి. పరభాషా వారితో పాటు తెలుగు వారికీ కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది. కానీ 50-50 ఛాన్స్ ఇచ్చినా తెలుగులో చాలా టాలెంట్ బయటికి వస్తుంది. ఇప్పటికి నేను కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను" అంటూ తన మనసులో మాటలు చెప్పింది ఈషా. ప్రస్తుతం ఈషా శాకుంతలం సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

× RELATED స్టైలిష్ సెల్ఫీ లుక్కులో మెగాబ్యూటీ..!
×