'రౌడీ హీరో'తో చర్చల్లో క్లాస్ డైరెక్టర్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానురాను ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేయని కాంబినేషన్స్ తెరమీదకు వస్తున్నాయి. కొన్ని మనం ఎక్సపెక్ట్ చేయగలుగుతాం. కొన్ని కాంబినేషన్స్ అసలు సెట్ కావని అనిపిస్తుంది. కానీ ఆఖరికి సెట్ కావేమో అనుకున్న కాంబినేషన్స్ బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి. అంటే అలా అన్ని కాంబినేషన్స్ లో జరగదు. ఎందుకంటే హీరో ఫుల్ మాస్ అయినప్పుడు రాబోయే డైరెక్టర్ కూడా ఇదివరకు మాస్ సినిమాలు చేసుంటే అంచనాలు రెట్టింపు అయిపోతాయి. కానీ హీరో మాస్ అయ్యుండి దర్శకుడు ఇదివరకు అన్ని సాఫ్ట్ ఫిలిమ్స్ చేసుంటే మాత్రం అంచనాలకు బదులుగా అనుమానాలు మొదలవుతాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి వైరల్ అవుతోంది. అదే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి - హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్. అరే ఈ కాంబినేషన్ ఇంకా అనౌన్స్ కాలేదు కదా అనిపించవచ్చు. కానీ కేవలం ఈ రెండు నేమ్స్ వింటేనే అలా ఎలా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే విజయ్ అంటే మాస్ మిక్సడ్ ఆటిట్యూడ్ కనిపిస్తుంది. అదే డైరెక్టర్ గౌతమ్ అంటే ఒక మళ్లీరావా - ఒక జెర్సీ లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తు వస్తాయి. ఇలాంటి పూర్తి అపోజిట్ కాంబినేషన్ సెట్ అవుతుందని అంటుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కాంబో న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ దక్కించుకుంటున్నాడు. నానితో తెరకెక్కించిన జెర్సీ మూవీ ఇటీవలే నేషనల్ అవార్డు గెలుచుకున్న సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు అదే జెర్సీని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రూపొందిస్తున్నాడు. అందుకే ఇప్పుడు గౌతమ్ పేరు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అయితే మొన్నటివరకు గౌతమ్.. హీరో రాంచరణ్ కు స్క్రిప్ట్ వినిపించడం జరిగింది. కానీ మెగాహీరో ఎందుకో సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ ఆ సినిమా ఉందా లేదా అనేది కూడా తెలియలేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండకు గౌతమ్ ఓ రొమాంటిక్ డ్రామా స్క్రిప్ట్ వినిపించాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ విషయంలో విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్. మరి ఈ కాంబినేషన్ అయినా ఫైనల్ అవుతుందేమో చూడాలి.
× RELATED సీన్ కోసం నిజంగానే నా చెంప వాయగొట్టాడు.. ఏడ్చేసా!
×