గ్లామరస్ ఊర్వశి.. వర్కౌట్ వీడియోతో చెమటలు పట్టిస్తోందిగా..!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది వయ్యారి భామలు ఉన్నప్పటికీ అందరూ మెచ్చే బాలీవుడ్ వయ్యారి మాత్రం ఊర్వశి రౌటేలా. అందాలను ఆస్వాదించే గ్లామర్ ప్రియులకు ఊర్వశి ఎల్లప్పుడూ తన అందాలతో వినోదం పంచుతూనే ఉంటుంది. ప్రస్తుత కరోనా కాలంలో కుర్రకారు కరోనా విషయం పక్కనపెట్టి.. ఊర్వశి గ్లామర్ షో కోసం తపించి పోతున్నారంటే.. ఆ అమ్మడు ఎంత అందంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎలా చూసినా కొందరు ముద్దుగుమ్మలు అప్పుడప్పుడు మాత్రమే అందంగా కనిపిస్తారు. కానీ ఊర్వశి.. అందాలరాశి. ఎప్పుడు చూసినా కళ్లు చెదిరే అందంతో కనిపిస్తుంది. మరి దాదాపు మూడున్నర కోట్లకు పైగా ఇంస్టా అభిమానులు ఊరికే పుట్టుకొస్తారా ఏంటి.. అందానికే అందం నువ్వే అంటూ కుర్రకారు పాటలు పాడుకుంటున్నారు.

చీరకట్టు నుండి టు పీస్ బికినీ వరకు ఊర్వశి ఏది ధరించినా ఆ దుస్తులకే అందం తీసుకొస్తుంది అమ్మడి సౌందర్యం. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఈ బాలీవుడ్ సుందరి అనేక అందాల పోటీల్లో విజేతగా నిలిచి.. సినిమా రంగంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. తనలోని అందమైన సత్తాను నటనలో చాటేందుకు తెగట్రై చేస్తుంది ఊర్వశి. ఇప్పటివరకు సినీరంగంలో ఊర్వశికి దక్కాల్సిన గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా వేదికగా ఊర్వశి నేటితరం కుర్రకారును.. అప్ కమింగ్ మోడల్స్ - హీరోయిన్స్ అందరికి ఫిట్నెస్ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది.

అమ్మడి వర్కౌట్ వీడియోస్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అంతలా హార్డ్ వర్క్ చేస్తోంది. తాజాగా ఇంస్టాలో ఊర్వశి వర్కౌట్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఊర్వశి గట్స్(పొట్టభాగం) పై ఆమె ట్రైనర్ పంచింగ్ చేయడం మనం చూడవచ్చు. అసలు ఆ వీడియోలో పంచింగ్ చూస్తేనే.. దిమ్మ తిరుగుతుంది. అలాంటిది అమ్మాయి ఊర్వశి హార్డ్ వర్క్ చూస్తే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పెయిన్ లేకుండా ఫలితం లేదంటూ అమ్మడు వీడియోకు కాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఆ వీడియో చూసిన వారంతా ఊర్వశిని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఫిట్నెస్ ఫ్రీక్ గా కోట్లమందికి ఊర్వశి స్ఫూర్తి. కానీ ఆ కస్టమంతా తాను నటించబోయే సినిమా కోసమే అని ఊర్వశి తెలిపింది. చూడాలి మరి ఈ గ్లామర్ బ్యూటీ ఏ సినిమాలతో మెస్మరైజ్ చేయనుందో..!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by URVASHI RAUTELA

× RELATED వెబ్ సిరీస్ రివ్యూ : ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’
×