సగం పన్ను ఎగ్గొట్టిన కంగన అలా కూడా సాధిస్తోంది!

క్వీన్ కంగనా రనౌత్ భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే నటిని తాను మాత్రమేనని పేర్కొన్నారు. అయితే `పని లేని` కారణంగా గత ఏడాది పన్నులో సగం చెల్లించలేకపోయానని తెలిపింది. ఏదేమైనా పెండింగ్ లో ఉన్న మొత్తానికి ప్రభుత్వం వడ్డీని వసూలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు.

నేను గరిష్ఠ పన్ను స్లాబ్ కిందకు వచ్చినా కానీ నా ఆదాయంలో దాదాపు 45 శాతం పన్నుగా చెల్లించాను. నేను అత్యధిక పన్ను చెల్లించే నటి అయినప్పటికీ 2020లో సరిగా పని లేకనే సగం పన్ను చెల్లించలేదు. నా జీవితంలో మొదటిసారి ఇలా అయ్యింది అని తెలిపారు.

పన్ను చెల్లించడం ఆలస్యం అయితే పెండింగ్ పన్నుపై ప్రభుత్వం వడ్డీ వసూలు చేస్తోంది. వడ్డీ అడగొద్దని ఆమె అన్నారు. ``సమయం మాకు వ్యక్తిగతంగా కఠినంగా ఉంటుంది కానీ మేం సమయం కంటే కఠినంగా మారతామని మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన ఘాటైన వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు.

సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన `తలైవి`(జయలలిత బయోపిక్) విడుదల కోసం కంగనా రనౌత్ ఎదురుచూస్తున్నారు. ఇది ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తలైవితో పాటు తేజస్.. మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా- ధాకాడ్ వంటి భారీ చిత్రాల్లో కంగన నటిస్తోంది. ఇందిరా గాంధీ కథతో తెరకెక్కించనున్న వేరొక చిత్రంలోనూ నటించనుంది.
× RELATED అయ్యో కంగన ఎంత పని జరిగింది? వీళ్లింతే!
×