పాత జ్ఞాపకాల్లో నమ్రత.. మళ్లీ ఆ రోజులు కావాలి

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పిల్లలతో మహేష్ బాబు గడిపే మధుర క్షణాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంటారు. ఆమె నెట్టింట రెగ్యులర్ గా మహేష్ బాబుకు సంబంధించిన ఫొటోలు మరియు విషయాలను షేర్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు అంతా కూడా మహేష్ గురించి తెలుసుకునేందుకు ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.

తాజాగా నమ్రత పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.సితార మరియు గౌతమ్ లతో మహేష్ బాబు ఉన్న ఫొటోను నెట్టింట షేర్ చేశారు. గడియారంలో వెనక్కు వెళ్తే అన్నట్లుగా మళ్లీ ఆ రోజులు కావాలనిపిస్తుంది అంటూ కామెంట్ పెట్టింది. కాలం ఎంతగా మారింది కదా అన్నట్లుగా నమ్రత పేర్కొన్నారు.

నెట్టింట ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సితార మరియు గౌతమ్ లు ఇప్పుడు పెద్ద వారు అయ్యారు. ఈ ఫొటోకు అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. సితార మరియు గౌతమ్ లు చూస్తుండగానే ఎంత పెద్ద వారు అయ్యారు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
× RELATED స్టైలిష్ సెల్ఫీ లుక్కులో మెగాబ్యూటీ..!
×