తెలంగాణలో స్కూళ్లపై కేసీఆర్ సర్కార్ షాకింగ్ నిర్ణయం

కరోనా కల్లోలంతో ఏడాదిగా చదువులు సాగడం లేదు. పోయిన ఏడాది చివర్లో ఈ ఏడాది మొత్తాన్ని కరోనా మింగేసింది. వరుసగా రెండేళ్లు పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయిపోయారు. దీంతో సర్కార్ ఈ ఏడాది అయినా పాఠశాలను తిరిగి తెరవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలిసింది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది.

వచ్చేనెల 5వ తేదీ తర్వాత స్కూళ్లను ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడానికి ధైర్యం చేయడం లేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులతో నష్టపోతున్నారు. అక్కడ సిగ్నల్స్ మౌళిక వసతులు లేక వాటిని ఆపుచేశారు.

ఈ ఏడాది కూడా చదువులు సాగకపోతే విద్యావ్యవస్థ అల్లకల్లోలంగా మారుతుందని.. పరిస్థితులు చేయిదాటిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. తల్లిదండ్రుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందుకే ఈ ఏడాది స్కూళ్లను ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ రెడీ అవుతోంది. ఈనెల 16 నుంచి 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్ లైన్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
× RELATED రోనాల్డ్ Vs కోక్ బాటిల్ః అసలు కథ ఇదీ!
×