బిగ్ బాస్ బ్యూటీ.. గ్లామరస్ ఫోటోషూట్!

తెలుగులో పాపులర్ రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. అయితే ప్రస్తుతానికి నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ - ఫేమస్ పర్సనాలిటీలు జనాలకు పరిచయం అయ్యారు. ముఖ్యంగా బిగ్ బాస్ 4వ సీజన్లో పాల్గొన్న సినీతారలు ప్రస్తుతం సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో మోనాల్ గజ్జర్ ఒక్కతే బాగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ భామ అలా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిందో లేదో గ్లామరస్ వార్తలకు హాట్ టాపిక్ గా మారింది.

అలాగే వచ్చిరాగానే ee ఏడాది అల్లుడు అదుర్స్ సినిమాలో 'రంభ ఊర్వశి మేనకా..' అంటూ ఐటమ్ సాంగ్ లో తన అందాలతో అదరగొట్టింది. మోనాల్ గజ్జర్ ప్రస్తుతం ఓ స్టార్ మా ఛానల్లో డాన్స్ రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తుంది. మరోవైపు ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వస్తే ఓకే చేస్తోంది. అయితే ఇదివరకు హీరోయిన్ గా తెలుగులో క్రేజ్ లేకుండా పోయిన మోనాల్ కోసం బిగ్ బాస్ తర్వాత పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడానికి రెడీ అయినట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. నిజంగా స్పెషల్ సాంగ్స్ చూస్తే త్వరలోనే మోనాల్ సినిమాలతో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ గ్యాప్ లో బిగ్ బాస్ ఫేవరేట్ అఖిల్ తో చెట్టాపట్టాలేసుకొని ఎంజాయ్ చేస్తుంది.

 అయితే తాజాగా అమ్మడు త్వరలో తన బాలీవుడ్ సినిమాల గురించి ప్రకటించే దిశగా ప్లాన్ చేస్తుందట. ఇటీవల మోనాల్ నటించిన బాలీవుడ్ చిత్రం కాగజ్.. జీ5 లో విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోనాల్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. అలాగే తన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి త్వరలోనే వెళ్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. మోనాల్ కు బిగ్ బాస్ పుణ్యమా అని సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. అందుకే ఫ్యాన్స్ కోసమైనా అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అమ్మడు ఓ స్టైలిష్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. అలా బెడ్ పై కూర్చొని పాజిటివ్ వైబ్స్ అంటూ పోస్ట్ పెట్టింది. అందులో పెద్దగా గ్లామర్ షో లేనప్పటికి పిక్ మాత్రం తెగవైరల్ అవుతోంది.
× RELATED అయ్యో కంగన ఎంత పని జరిగింది? వీళ్లింతే!
×