#PSPK28.. వేచి ఉండలేను అంటూ అగ్గి రాజేసిన దేవీ

#PSPK28.. ప్రస్తుతం అభిమానుల్లో పెద్ద చర్చకు తెర తీస్తున్న చిత్రమిది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న `హరిహర వీరమల్లు` (#PSPK27) తర్వాత పవన్ చేయబోతున్న చిత్రమిది. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పవన్ - హరీష్ - దేవీశ్రీ కాంబినేషన్ అనగానే ఒక్కసారి `గబ్బర్ సింగ్` డేస్ లోకి వెళ్లాల్సిందే. ఆ సినిమాని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలబెట్టిన ఘనత దేవీశ్రీదే. చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో మైండ్ బ్లాక్ చేశాడు. పవన్ నటన.. హరీష్ దర్శకత్వ ప్రతిభ.. దేవీశ్రీ రాకింగ్ మ్యూజిక్ గబ్బర్ సింగ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి.

అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీటవుతోంది అనగానే అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. #PSPK28 కి సంబంధించిన ఏ సమాచారం రివీలైనా పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా స్క్రిప్ట్ పైనా... మ్యూజిక్ విషయాలు ఎంతవరకూ వచ్చాయి? ఇప్పటికే ఎన్ని పాటలు కంపోజ్ చేసారు? ఇలాంటి వివరాల కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రం నాన్ బాహుబలి కేటగిరీలో ది బెస్ట్ ఓపెనింగ్ ను అందించడమే గాక... COVID-19 మహమ్మారి  రెండవ వేవ్ ప్రారంభంలో  సూపర్ హిట్ గా నిలిచి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ తీవ్రతరం కావడానికి ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు పవనిజం అంటే ఏమిటో చూపించి వకీల్ సాబ్ ని కాపాడారు.

అందుకే హరీష్ తో సినిమాపైనా ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. పిఎస్ పికె 28 గురించి తాజాగా దేవి శ్రీ ప్రసాద్ చెప్పిన సంగతులు ఉత్కంఠ పెంచాయి. ``స్క్రిప్ట్ సూపర్ డూపర్ గా కుదిరింది. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రేమలో పడతారు`` అని ఒక్కసారిగా హైప్ పెంచాడు. హరీష్ శంకర్ (రచయిత-దర్శకుడు) అంత మంచి స్క్రిప్ట్ ని రెడీ చేశారని తెలిపారు. ``ప్రస్తుతం పాటల కోసం పని చేస్తున్నాం.  రెండు పాటలు సిద్ధం అయ్యాయి. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా.. అని ఆసక్తిగా వేచి చూస్తున్నాను. ఇంకా వేచి చూడలేను`` అని  దేవీశ్రీ అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు గాల్లో తేల్తున్నారు.

హరీష్ శంకర్ సినిమాల్లో పాజిటివిటీ ఎనర్జీని ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడతారు. గబ్బర్ సింగ్ ని ఎనర్జిటిక్ గా మలచడంలో అతడి ట్యాలెంట్ అపారంగా పని చేసింది. దేవీశ్రీ సంగీతం ఇచ్చిన పవన్ చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్లుగానే నిలిచాయి. జల్సా.. గబ్బర్ సింగ్ చార్ట్ బస్టర్ సాంగ్స్ తో అలరించాయి. ఆ తర్వాత మళ్లీ అంత మంచి ఆల్బమ్ ని అభిమానులు ఆశిస్తున్నారు.
× RELATED స్టైలిష్ సెల్ఫీ లుక్కులో మెగాబ్యూటీ..!
×