సమంత తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్..?

కమర్షియల్ చిత్రాలకు తనదైన శైలిలో కామెడీని జోడించి వరుస హిట్స్ కొడుతున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్.. ఆ తర్వాత 'సుప్రీమ్' 'రాజా ది గ్రేట్' 'F2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం 'F2' ప్రాంఛైజీలో 'F3' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా.. సమంత అక్కినేని తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేశారు. అయితే మహేష్ వేరే దర్శకులకు కమిట్మెంట్స్ ఇవ్వడంతో.. అనిల్ కూడా వేరే ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంతను కలిసిన అనిల్ రావిపూడి.. ఆమెకు ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీ లైన్ చెప్పారట. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రీప్ట్ రెడీ చేయాల్సిందిగా సామ్ సూచించారట. అయితే ఇందులో విలన్ రోల్ లో మరో స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని టాక్. వీటిలో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇకపోతే బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న అనిల్ రావిపూడి.. ఆయనకు కూడా ఓ స్టోరీ నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ రెడీ చేసిన పవర్ ఫుల్ స్టోరీకి బాలకృష్ణ సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ రావడంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ సైన్ చేసిన సినిమాలు పూర్తయ్యాక వచ్చే ఏడాది 'బాలయ్య-అనిల్' కాంబోలో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా సమంత సినిమా చేస్తాడా లేదా బాలయ్య మూవీ చేస్తాడా అనేది చూడాలి.
× RELATED సీన్ కోసం నిజంగానే నా చెంప వాయగొట్టాడు.. ఏడ్చేసా!
×