ఈ బోల్డ్ బ్యూటీ ఏడ్చిన ఫోటోలు అందుకే డిలీట్ చేసిందట..!

తెలుగు చిత్రపరిశ్రమలో 'ఆర్ఎక్స్100' మూవీ బ్యూటీ పాయల్ రాజపుత్ క్రేజ్ మాములుగా లేదు. డెబ్యూ మూవీతోనే ఒక్కసారిగా కుర్రకారుకు కలలరాణిగా మారిపోయింది ఈ ఢిల్లీబ్యూటీ. ఫస్ట్ సినిమాతోనే నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఎంట్రీతో ఫస్ట్ హిట్ కొట్టింది కానీ ఊహించినట్లుగా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కాలేకపోయింది. అలాగే అమ్మడికి అవకాశాలు కూడా పెద్దగా రాలేదని టాక్. అయితే బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చేసరికి ఈ వయ్యారిని చాలామంది మేకర్స్ బోల్డ్ సినిమా కథలతోనే కలిశారట. కానీ అవన్నీ కాదని మళ్లీ 'ఆర్డిఎక్స్ లవ్' అనే బోల్డ్ సినిమా చేసింది. ఆ సినిమాలో ఎన్నడూ చూడని పాయల్ అందాల ప్రదర్శన అదిరింది.

అమ్మడి అందం దెబ్బకు కుర్రకారు మతులు కోల్పోయారు కానీ సినిమా మాత్రం నిలబడలేకపోయింది. ఆ సినిమా ప్లాప్ ప్రభావం పాయల్ పై బాగా చూపింది. ఇప్పుడు కూడా ఆర్ఎక్స్100 హీరోయిన్ అనే ముద్రను పోగొట్టుకోలేక పోయింది పాయల్. ఆ మధ్యలో అవకాశాలు సీత సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. అనంతరం విక్టరీ వెంకటేష్ సరసన వెంకిమామలో ఆడిపాడింది. ప్రస్తుతం హీరోయిన్స్ వెబ్ సిరీస్ వెబ్ ఫిలిమ్స్ అంటూ ఓటిటి వైపు వెళుతున్నారని.. అదేవిధంగా పాయల్ కూడా ఓటిటి వైపు అడుగులేసింది. అయితే పాయల్ అందాలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే అమ్మడు అప్పుడప్పుడు వేడెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది.

అయితే ఇటీవల ఏడుపు మొహంతో ఫోటోలు పోస్ట్ చేసింది. కానీ ఎందుకో మళ్లీ డిలీట్ చేసేసరికి సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే చాలా ట్రోలింగ్ కు గురైంది. మరి ఆ ఏడుపుకు కారణం ఏంటంటే.. పాయల్ ఆ మధ్యలో కోవిడ్ వాక్సిన్ వేయించుకుంది. అయితే పాయల్ కు మెడిసిన్స్ - ఇంజక్షన్స్ అంటే భయమట. అందుకే ఏడ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అమ్మడు ఆ ఫోటోలు డిలీట్ చేసేసింది. ఇదిలా ఉండగా.. పాయల్ ప్రెసెంట్ పలు ఓటిటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
× RELATED వెబ్ సిరీస్ రివ్యూ : ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’
×