హీరోయిన్లకు తప్పని కష్టాలు!

దేశంలో కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అన్ని వర్గాల ప్రజలనూ అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారి నుంచి సినిమా సెలబ్రిటీలు కూడా తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులు కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో హీరోలతోపాటు టెక్నీషియన్ల వరకు ఉన్నారు.

తాజాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా కూడా కరోనా బారిన పడ్డారు. కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆండ్రియా.. తాజాగా ఇలయదళపతి విజయ్ ‘మాస్టర్’ చిత్రంలోనూ అలరించారు.

కొవిడ్ నిర్ధారణ కావడంతో ఆమె ప్రస్తుతం.. హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు సమాచారం. కరోనా లక్షణాలు సాధారణంగానే ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు కూడా కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. రకుల్ నుంచి దీపికా దాకా చాలా మంది కొవిడ్ బారిన పడి దాన్ని ఓడించారు.

ఆండ్రియా కూడా అదేవిధంగా.. బయటపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ కోరుతున్నారు.
× RELATED అయ్యో కంగన ఎంత పని జరిగింది? వీళ్లింతే!
×