భారత వీధుల్లోని శవాలను చూడండి.. ప్రధానిపై ఆగ్రహం!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్.. ఆ దేశ ప్రధాని మోరీసన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇండియాలో ఉన్న ఆసీస్ క్రికెటర్లు నేరుగా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకుండా చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించి వెళ్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తామని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రధానిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు స్లేటర్.

''మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్ లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది నిజం. మీరు మీ ప్రైవేటు జెట్లో వెళ్లి అక్కడి (భారత్) వీధుల్లో ఉన్న శవాలను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాను'' అని అగ్రహం వ్యక్తం చేశాడు స్లేటర్.

ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో.. ఆసీస్ క్రికెటర్లంతా మాల్దీవులకు వెళ్లేందుకు పయనమయ్యారు. శ్రీలంక మీదుగా అక్కడికి వెళ్లి అక్కడ రెండు వారాలు గడిపిన తర్వాత స్వదేశానికి బయల్దేరి వెళ్లనున్నారు.
× RELATED రోనాల్డో-కోకాకోలా వివాదం: క్యాష్ చేసుకున్న ఫెవికాల్
×