ఏపీ వాసులకి గుడ్ న్యూస్ .. కరోనా 'ఎన్ 440కే వేరియెంట్' బలమైనది కాదట

ఏపీ లో కొత్త రకం కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. అత్యంత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు  అభివర్ణిస్తున్న ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ ఇపుడ ఏపీలో విస్తరిస్తోంది. కర్నూలు లో నమోదైన కొత్త రకంగా ఎన్ 440కే  వేరియెంట్ కరోనా వైరస్ ఇపుడు ఏపీవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. అందుకే ఏపీలో ప్రతీ రోజూ 20 వేల దాకా కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  సెకండ్ వేవ్లో ఎన్440కే వేరియంట్ 10 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణుల పరిశోధనలో తేలింది.  ఏ2ఏ స్ట్రెయిన్ లో జరిగిన జన్యు మార్పుల వల్ల ఏర్పడినదే కొత్త వైరస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ2ఏ స్ట్రెయిన్ సోకిన వారి కంటే ఎన్440కె బారిన పడిన వారిలో వైరస్ లోడ్ 10 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఏ3ఐ స్ట్రెయిన్ రకంతో పోల్చితే ఎన్ 440కె బారిన పడిన వారిలో 1000 రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ కనిపిస్తుందంటున్నారు. ముఖ్యంగా బి.1.617 618 వైరస్లు ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది ఉత్తరాది రాష్ట్రాల్లో. ఇక గత రెండు నెలలుగా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర  లో డబుల్ మ్యూటెంట్ రకం విస్తృతి కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో అత్యధిక కేసులకు కొత్త రకంగా కరోనా వైరస్ కారణమవుతోందని చెబుతున్నారు.  అయితే ఏపీలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త రకం వైరస్ ఎన్ 440కే  వేరియెంట్ పట్ల భయం అక్కర్లేదు అని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ స్పష్టం చేసింది. జన్యు పరిమాణ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్ 440కే  వేరియెంట్ బయటపడింది అని అయితే ఎంత వేగంగా అయితే వ్యాప్తి చెందుతుందో అంతే  వేగంగా ఈ వైరస్ కనుమరుగు అవుతుంది అని అన్నారు. ఈ వైరస్ విస్తరణ ఎక్కువగా  అని అన్నారు. ప్రస్తుతం బి.617 రకం వైరస్  మాత్రమే ప్రభావం చూపిస్తుందని అన్నారు.
× RELATED సీన్ కోసం నిజంగానే నా చెంప వాయగొట్టాడు.. ఏడ్చేసా!
×