పవన్ షూటింగ్ ప్లాన్ తో '#PSPK28' మరింత ఆలస్యం కానుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అర డజను ప్రాజెక్ట్స్ లో ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమా విడుదల అవ్వగా.. మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్న '#PSPKRana' మూవీ 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మరో సినిమా స్టార్ట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇయర్ ఎండింగ్ దాకా పవన్ మరో సినిమా చేసే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి.

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న పీకే.. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మహమ్మారి ఉదృతిని బట్టి పవన్ జూలైలో తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాలని అనుకుంటున్నారట. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా రోజులుగా పవన్ షూట్ లో పాల్గొనడం లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల షెడ్యూల్స్ మరింత ఆలస్యం అవుతాయి. అందులోనూ ముందుగా క్రిష్ సినిమా మరియు 'ఏకే' రీమేక్ లని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పీకే చేసే '#PSPK28' ప్రాజెక్ట్ ఇంకాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది.
× RELATED కరోనా.. ఓ పాసింగ్ క్లౌడ్ః నాని
×