కరోనా వైరస్ మహేష్ కంటే పెద్ద సూపర్ స్టార్!-ఆర్జీవీ

ఆర్జీవీనా మజాకానా? ఆయన ఏ కామెంట్ చేసినా అది సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. స్పాంటేనియస్ గా అతడు విసిరే పంచ్ లకు వ్యంగ్యానికి నవ్వని వాళ్లు ఉండరు. ఆర్జీవీ కామెడీ సెన్స్ సెటైరికల్ టైమింగ్ గురించి తెలిసినవారు కచ్ఛితంగా ఆయనకు వీరాభిమాని అవుతారు. అతడితో నేరుగా మాట్లాడిన వారికి ఆయన ఇంకా ఎక్కువ కనెక్టవుతారు. ఇది స్వయంగా అనుభవించిన వాడికే తెలుసు.

ఇప్పుడు కూడా ఇంత కల్లోలంలో ఆయన విసిరిన ఒక పంచ్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచం సెకండ్ వేవ్ తో కల్లోలంలో ఉంటే ఆర్జీవీ దానిపై జోక్ చేశారు. కరోనా వైరస్ అనేది మహేష్ కంటే రజనీ కంటే సల్మాన్ కంటే కూడా పెద్ద సూపర్ స్టార్ అని ఆర్జీవీ అన్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ప్రముఖ జర్నలిస్టుతో చిట్ చాట్ లో ఆర్జీవీ.. ``వై కరోనా ఈజ్ బిగ్గర్ స్టార్ దేన్ మహేష్... అండ్ వై లవర్స్ షుడ్ నాట్ స్టాప్ కిస్సింగ్?`` అంటూ ఆయన తనదైన శైలిలో చెలరేగారు. కరోనా వైరస్ పై ఆర్జీవీ సెటైర్ల మాటేమో కానీ.. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నిటినీ రిలీజ్ కాకుండా అడ్డుకున్న పాపం కరోనాదే.. దానికి ఏం చెబుతారో!

× RELATED పవన్ ను మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు దేవిశ్రీ తీవ్ర ప్రయత్నాలు
×