కాంచన 3 ఫేం నిక్కీ తంబోలి సోదరుడు కరోనాతో మృతి

యువకథానాయిక నిక్కీ తంబోలి సోదరుడు జతిన్ తంబోలి(29) కరోనాతో మృతి చెందారు. తన సోదరుడు జతిన్ తంబోలిని కోల్పోయిన తరువాత హృదయాన్ని కలిచివేసే ఒక నోట్ ని నిక్కీ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అదే సమయంలో రంగం ఫేం పియా బాజ్ పాయ్ సోదరుడు కరోనాతో మృతి చెందడం సినీవర్గాల్లో కలకలం రేపింది.

సోదరుడిని పోగొట్టుకున్న అనంతరం నిక్కి తంబోలి తన సోదరుడు జతిన్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి సుదీర్ఘ నోట్ లో తీవ్రమైన ఆవేదనను వ్యక్తపరిచారు..``ఈ ఉదయం దేవుడు నీ పేరును పిలవబోతున్నాడని మాకు తెలియదు .. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. మరణంలో కూడా మేము అదే చేస్తాము. నీవు ఒంటరిగా వెళ్ళలేదు. మీరు మాలో కొంత భాగం.. మేము మీతో వెళ్ళాము.. దేవుడు మిమ్మల్ని ఇంటికి పిలిచిన రోజు నీవు మాకు అందమైన జ్ఞాపకాలు మిగిల్చావు. నీ ప్రేమ ఇప్పటికీ మా గైడ్.. మేము  చూడలేనప్పటికీ నీవు ఎల్లప్పుడూ మా పక్షాన ఉన్నావు. మా కుటుంబ గొలుసు విరిగిపోయింది. భగవంతుడు మనల్ని ఒక్కొక్కరిగా పిలుస్తున్నట్లుగా గొలుసు మళ్లీ లింక్ అవుతుంది`` అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన సోదరుడికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని 20 రోజులకు పైగా ఆసుపత్రిలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. నిక్కి తంబోలి తన సోదరుడి కోసం ప్రత్యేకమైన పూజను ఆచరించారు. తన సోదరుడి క్షేమం కోసం పూజా గదిలో ప్రార్థిస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. నిక్కి తంబోలి తన ప్రార్థనలకు త్వరలో సమాధానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కఠినమైన సమయాల్లో పోరాడమని ఆమె తన సోదరుడిని కోరింది.

నిక్కీ తంబోలి లారెన్స్ సరసన కాంచన 3లో నటించారు. ఆ తర్వాత చీకటి గదిలో చితక్కొట్టుడు సహా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుకులకు సుపరిచితం. నిక్కి చివరిసారిగా బర్త్ డే పవ్రీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. బిగ్ బాస్ 14 టాప్ 3 ఫైనలిస్టులలో ఆమె ఒకరు. ఈ కార్యక్రమంలో రుబినా దిలైక్ విజేతగా నిలవగా.. రాహుల్ వైద్య రన్నరప్ గా నిలిచారు.

ఇదిలా ఉండగానే రంగం ఫేం పియా బాజ్ పాయ్ సోదరుడు కూడా కరోనాతో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరిన అతడు వెంటిలేటర్ బెడ్ లభించక మృతి చెందిన ఘటన కలచివేసింది. స్థానిక భాజపా ఎమ్మెల్యేని పియా సోషల్ మీడియా వేదికగా అర్థించినా అతడు ఏ సాయం చేయలేదు. కరోనా ఒకేరోజు ఇద్దరు కథానాయికల తమ్ముళ్లను బలి తీసుకుంది.
× RELATED 'రాధేశ్యామ్' విషయంలో స్టార్ హీరోయిన్ కంగారు పడుతోందా..?
×