మహమ్మారిని ఓడించాలని అనుష్క ఎమోషనల్ నోట్

స్వీటీ అనుష్క శెట్టి ఈ కష్ట సమయాల్లో పాజిటివిటీని పెంచుకోవాలని  సూచించారు. కొనసాగుతున్న మహమ్మారిని ఓడించటానికి ప్రజలు కలిసి రావాలని .. ఈ ప్రయత్నంలో అందరూ ఉత్సాహంగా ఉండాలని ప్రతికూల విషయాలలో కాస్త నెమ్మదిగా ఉండాలని ప్రజలనుద్ధేశించి కోరారు. ఆ మేరకు ఇన్ స్టాలో సుదీర్ఘ నోట్ ని రాశారు.

మీకు తెలిసినదే.. ప్రస్తుతం మనం కరోనావైరస్ రెండవ వేవ్ లో ప్రాణాంతక వైరస్ తో పోరాడుతున్నాం. ఇది నిజంగా విషాదకరమైన సమయం.. ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోతున్నారు. సరైన చికిత్స పొందలేకపోవడం.. ఆక్సిజన్ లేకపోవడం.. ఆస్పత్రి బెడ్లు .. మౌళిక సదుపాయాల సరఫరా లేక దేశం నిస్సహాయంగా మారింది. మరణాల వార్తలు పెరుగుతున్న కేసులు ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. సెలబ్రిటీలు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ``ఈ మహమ్మారిని ఓడించటానికి దేశానికి సహాయం చేయడానికి చాలా మంది సాధారణ ప్రజలు ఉన్నారు. ప్రజలెవరూ ఆశలు కోల్పోవదు. మనమంతా కలిసి వైరస్ పై పోరాడి గెలుస్తామ``ని పోరాట పటిమను నూరి పోసే ప్రయత్నం చేశారు అనుష్క.

వైరస్ దాడి చేస్తుంటుంది.. ప్రతి ఒక్కరూ ఆపేందుకు తమ వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ... నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేరు ... ఈ కఠినమైన సమయాల్లో నావిగేట్ చెయ్యడానికి మనమందరం ఒకరికొకరు సహాయం చేద్దాం ... దయచేసి ప్రోటోకాల్ ను అనుసరించండి ... ఇంట్లో ఉండండి ... సెల్ఫ్ లాక్ డౌన్ విధించండి ... ఉరు.. కుటుంబం .. స్నేహితుడితో మాట్లాడండి ... సన్నిహితంగా ఉండండి ... ప్రతి ఒక్కరూ తమ అనుభూతిని ఎలా వ్యక్తీకరించాలో తెలియదు ... కొంత శ్వాస వ్యాయామం చేయండి. .. ప్రతిరోజూ ఒక సానుకూల విషయం కోసం వెతకండి ... సానుకూలంగా ఉండండి మన చుట్టూ నిలబెట్టడానికి ఆ శక్తి అవసరం ... ప్రార్థనలు అవసరం.. అని స్వీటీ అన్నారు.
 
ప్రస్తుతానికి ఏమి చేయవచ్చనే దానిపై దృష్టి పెట్టండి  ప్రతికూలమైన దేనిపైనా శక్తిని హరించకూడదు ... మనం నిజంగా మానవునిగా గెలవగం... అని నోట్ లో రాశారు. నిశ్శబ్ధం తర్వాత అనుష్క తదుపరి చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. జాతిరత్నాలు ఫేం నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు.
× RELATED 'రాధేశ్యామ్' విషయంలో స్టార్ హీరోయిన్ కంగారు పడుతోందా..?
×