వకీల్ సాబ్ దర్శకుడితో నాయికల హోలీ సంబరం

తీవ్రమైన క్రైసిస్ లోనూ రిలీజైన పవన్ `వకీల్ సాబ్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కేవలం మూడు రోజుల్లోనే మెజారిటీ షేర్ రాబట్టింది. కోవిడ్ వల్ల థియేటర్లు మూత వేయడంతో చివరికి పంపిణీవర్గాలకు కొంత మేర నష్టాలు తప్పలేదు కానీ.. అనంతరం ఓటీటీ డీల్ రీడిజైన్ తో నిర్మాత దిల్ రాజు భారీగా లాభపడ్డారని కథనాలొచ్చాయి.

అదంతా ఒకెత్తు అనుకుంటే ఈ చిత్రంలో నటించిన ముగ్గురు నటీమణులు అంజలి-నివేద- అనన్య నాగళ్ల తమ దర్శకుడు వేణు శ్రీరామ్ తో హోలీ సంబరం జరుపుకుంటున్న ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ వీడియో నిజానికి అన్న చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. అలా రంగులు జల్లుకుంటూ నిజమైన ఆత్మీయానుబంధాన్ని పంచుకుంటున్న తీరు ఆకర్షిస్తోంది.

వకీల్ సాబ్ చిత్రంలో ఆ ముగ్గురు భామల పాత్రలు కీలకం. ఆ ముగ్గురూ అనుకోని సమస్యలో చిక్కుకుంటారు. ఆ తర్వాత వకీల్ సాబ్ గా పవన్ ఎంట్రీతో ఏం జరిగింది? అనేదే ఈ సినిమా. మహిళల సమస్యలపై గొప్పగా తెరకెక్కిన చిత్రమిదని క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ పింక్ కి.. కోలీవుడ్ రీమేక్ `నేర్కొండ పార్వై` కి భిన్నంగా టాలీవుడ్ లో వకీల్ సాబ్ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించి మెప్పించగలిగిన గొప్ప దర్శకుడిగా వేణు శ్రీరామ్ కితాబు అందుకున్నారు. ఈ విజయంతో అతడికి బన్నీ తిరిగి ఆఫర్ ఇస్తున్నారని సమాచారం. ఐకన్ చిత్రానికి వేణు శ్రీరామ్ రీవర్క్ చేసే అవకాశం దక్కనుందన్న సమాచారం ఉంది.
× RELATED కరోనా.. ఓ పాసింగ్ క్లౌడ్ః నాని
×