ఇండియాలో కరోనా ఉధృతికి కారణం చెబితే జరిగేది అదేః సీరం సీఈవో

భారత్ లో కరోనా ఉధృతికి అసలైన కారణం చెబితే తన తల తెగిపడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన.. ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి కుంభమేళా ఎన్నికలే కారణం అనే వాదనను మీరు సమర్థిస్తారా? అని రిపోర్టర్ ప్రశ్నించారు.

దీనికి అదర్ పూనావాలా స్పందిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబితే.. నా తల తెగిపడుతుంది. ఇది చాలా సున్నితమైన అంశం. బహుశా ఇంతటి విపత్తు వస్తుందని దేవుడు కూడా ఊహించి ఉండడేమో?’’ అని అన్నారు.

భారత్ లో సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల క్రితం వ్యాక్సిన్ ఉత్పత్తి సరఫరా పెంచాలని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పిన పూనావాలా.. కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోయారు. అయితే.. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే తాను భారత్ తిరిగి వస్తానని చెప్పారు.
× RELATED గల్లా జయదేవ్ కంపెనీకి హైకోర్టులో రిలీఫ్
×