మాస్ రాజా మూవీ వాయిదా..!

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ.. ప్రస్తుతం ఫుల్ జోష్ లో 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. దాదాపు నాలుగు ప్లాప్ మూవీస్ తర్వాత క్రాక్ అనే సూపర్ హిట్ పడేసరికి మాస్ రాజా మాములు స్పీడ్ లో లేడు. కరోనా కారణంగా అందరు హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసేందుకు వెనకాముందు అవుతున్న తరుణంలో క్రాక్ మేకర్స్ ధైర్యంగా సినిమా రిలీజ్ చేశారు. 50% అక్క్యూపెన్సిలో సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. క్రాక్ విజయంతో టాలీవుడ్ లో మిగతా సినిమాలకు కూడా ధైర్యం లభించి రిలీజ్ చేశారు.. హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతి పెరిగే సరికి ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడిపోయాయి.

అయితే తాజాగా మాస్ న్యూ మూవీ "ఖిలాడి" కూడా అదే బాటలో వెళ్ళింది. సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు ఇటీవలే మేకర్స్ అధికారికంగా తేల్చిచెప్పేసారు. నిజానికి కరోనా సమయం అయినప్పటికీ మాస్ రాజా 'ఖిలాడి' మూవీ మే 28న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలు నిలిచిపోయి.. షూటింగ్స్ జరగట్లేవ్ కాబట్టి ఖిలాడి కూడా వాయిదా సినిమాల జాబితాలో చేరింది. మరి ఎప్పుడు అనేది తెలియలేదు కానీ త్వరలోనే రిలీజ్ చేయనున్నారట. ఫుల్ లెన్త్ యాక్షన్ ఖిలాడి మూవీని డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తుండగా.. డింపుల్ హయాతి - మీనాక్షిచౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పింది. చూడాలి మరి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో.. కానీ ఇండస్ట్రీలో మాత్రం జులైలో రిలీజ్ కాబోతున్నట్లు టాక్.
× RELATED విలేకరి వృత్తిలో అగ్ర కథానాయికలు..!
×