దాసరికి పద్మ పురస్కారం దక్కితే పరిశ్రమకే గౌరవం!-చిరు

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు 74వ పుట్టినరోజు నేడు. దర్శకుడు..నటుడు.. నిర్మాత.. రచయిత.. పాటల రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ఆయన సుపరిచితుడు. దాసరి మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు- రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిలింఫేర్-సౌత్ అవార్డులు గెలుచుకున్నారు.

స్వర్గం నరకం- అమ్మ రాజీనామా- ఒసేయ్ రాములమ్మ- సర్దార్ పాపరాయుడు- శివరంజని- మేఘసందేశం- బొబ్బిలి పులి- గోరింటాకు- ప్రేమాభిషేకం- మజ్ను సహా ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. 30 మే 2017 న 70 సంవత్సరాల వయసులో మరణించారు.

నేడు (4మే) దాసరి జయంతిని పురస్కరించుకుని దాసరినుద్ధేశించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాల్లో గురువుగారైన దాసరిపై తన ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు. ``దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాల్లో ఒకదానిని మించిన మరో చిత్రాన్ని తన అపూర్వ ద్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు..నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడానికి ఆయన చేసిన కృఇ.. ఎప్పటికీ మార్గదర్శకమే. శ్రీ దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు దక్కకపోవడం ఒక తీరని లోటు. ఆయనకి పోస్త్యుమస్ గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవమవుతుంది`` అని నోట్ లో వ్యాఖ్యానించారు.

దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తమ ప్రేమను ట్వీట్ల రూపంలో చూపించారు. ప్రముఖుల జాబితాలో చిరంజీవి- దర్శకుడు మారుతి- గోపీచంద్ మలినేని- బాబీ -వక్కంతం వంశీ ఉన్నారు. వీరు లెజెండ్ దాసరి జయంతి సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.
× RELATED కరోనా.. ఓ పాసింగ్ క్లౌడ్ః నాని
×