మార్కెట్లో రెమ్ డెసివిర్ డూప్లికేట్ టీకాలు

ఒకవైపు కరోనా టీకాలు అందక జనాలు నానా అవస్తలు పడుతున్నారు. కోవీషీల్డ్ కోవాగ్జిన్ టీకాలు వేయించుకునేందుకు జనాలు సెంటర్లను వెతుక్కుంటున్నారు. ఇదే సమయంలో మరో టీకా రెమ్ డెసివిర్ ను  బ్లాకులో అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒరిజినల్ రెమ్ డెసివిర్ టీకాలను స్వాధీనానికి ప్రభుత్వం అవస్తలు పడుతుంటే దీనికి తోడు తాజాగా డూప్లికేట్ టీకాలు కూడా మొదలైంది.

తాజాగా రాజమండ్రి ప్రాంతంలో రెమ్ డెసివిర్ డూప్లికేట్ టీకాలను పెద్దఎత్తున అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2. కోట్ల 73 లక్షల 70 వేల డూప్లికేట్ రెమ్ డెసివిర్ టీకాలను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. డూప్లికేట్ టీకాలను మార్కెట్లో చెలామణి చేయించటానికి వీలుగా తయారీ పంపిణీ మార్కెటింగ్ లాంటివి పక్కా వ్యవస్ధీకృతంగా చేస్తుండటం గమనార్హం.
× RELATED డేటింగ్ చేయాలని యువతకు లీవ్స్
×