బిగ్ బ్రేకింగ్ : ఐపీఎల్ 2021 వాయిదా !

క్రికెట్ అభిమానులకి అతి పెద్ద బ్యాడ్ న్యూస్. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లువురు ఆటగాళ్లు సహయక సభ్యులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.  కోల్ కతా ఆటగాళ్లు ఇద్దరు చెన్నై టీం సభ్యులు మరో ముగ్గురు కరోనా మహమ్మారి  బారిన పడ్డారు. దీనితో సోమవారం రాత్రి కోల్ కతా-బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రీషెడ్యూల్ అయ్యింది. తాజాగా ఢిల్లీ గ్రౌండ్ లో పనిచేసే ఐదుగురు కరోనా బారిన పడిన నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్క ముంబై స్టేడియంలోనే మ్యాచులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది బయో బబుల్ మరింత కఠినంగా ఎంతవరకు అమలు చేయగలం అన్న ఆలోచన చేసిన బీసీసీ…ప్రస్తుత పరిస్థితుల్లో ఒక  వారం రోజుల పాటు ఐపీఎల్ ను తాత్కాలికంగా  వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.   వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది అని బీసీసీఐ ప్రకటించింది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. అలాగే బయోబబుల్లో ఉన్న క్రీడాకారులు కూడా కరోనా బారిన పడ్డారు.
× RELATED ఏపీలో ఇకపై ఆ కోర్సులన్ని ‘ఇంగ్లిష్’లోనే !
×