పిక్ టాక్: సూపర్ కూల్ లుక్ లో సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం ''అన్నాతే''. మాస్ డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ కెరీర్లో వస్తున్న ఈ 168వ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార - కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కోవిడ్ కారణంగా నిలిపేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించడానికి రజినీకాంత్ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రజినీకాంత్ ''అన్నాతే'' సెట్స్ లో అడుగుపెట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా షూటింగ్ స్పాట్ లో రజినీ కి సంబంధించిన ఓ కాండీడ్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో డైరెక్టర్ శివ తో కలిసి తలైవర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. ఖద్దరు చొక్కా - పంచె కట్టులో సూపర్ స్టార్ లుక్ సూపర్ కూల్ గా ఉంది. ఈ ఫొటో విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ కావడంతో పాటుగా ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇకపోతే ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 'దర్బార్' తర్వాత రజినీకాంత్ నుంచి వస్తున్న 'అన్నాతే' సినిమాపై తలైవా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

× RELATED బిగ్ బాస్ బ్యూటీ.. గ్లామరస్ ఫోటోషూట్!
×