టక్ జగదీష్' వాయిదా.. ఇది చాలా చిన్న బ్రేక్ మాత్రమే అంటున్న నాని..!

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ''టక్ జగదీష్''. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి 'టక్ జగదీష్' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే రేపు ఉగాదికి ట్రైలర్ విడుదల కూడా లేదని చెబుతూ హీరో నాని ఓ వీడియో వదిలాడు.

నాని మాట్లాడుతూ.. ''టక్ జగదీష్ రీ రికార్డింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది ఫ్యామిలీ మొత్తం ఇంటిళ్లపాదీ కలసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ ఏడాది క్రాక్ నుంచి వకీల్ సాబ్ వరకు  ఎన్నో బ్లాక్ బస్టర్స్ సూపర్ హిట్స్ చేశారు. తెలుగు వాళ్ళని సినిమాని సెపరేట్ చేయలేం. కానీ కొత్త సినిమాల రిలీజుల విషయంలో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. ఉగాదికి టక్ జగదీష్ ట్రైలర్ రావడం లేదు. ఎప్పుడిస్తే అపౌడు6అందులో రిలీజ్ డేట్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 23 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాం'' అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 'లవ్ స్టోరీ' 'తలైవి' చిత్రాలను కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.× RELATED #లైగర్ VD స్పెషల్ డే కానుక ఏమై ఉంటుంది?
×