ఐఎంఎస్ స్కాంలో నకిలీ రోగులు

తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ కుంభకోణాలు మరిచిపోకముందే మరో కుంభకోణం వెలుగుచూసింది. ఈసారి బీమా వైద్య సేవల విభాగం (ఐఎంఎస్) కుంభకోణం బయటపడింది. డొల్ల కంపెనీలను సృష్టించి అధిక ధరలకు మందులను కొనుగోలు చేసినట్టు రుజువైంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగేసినట్టు వెలుగుచూసింది. కార్మికులను మోసగించిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

తెలంగాణలోని ఐఎంఎస్ విభాగంలో వైద్య శిబిరాల నిర్వహణ పేరిట కార్మిక పారిశ్రామిక వాడల్లో 2015-18 మధ్య కాలంలో లెక్కకు మించి వైద్య శిబిరాలు నిర్వహించినట్టు చూపించారు. పదుల సంఖ్యలో రోగులు వస్తే.. వందల సంఖ్యలో పేర్లు నమోదు చేశారు. నకిలీ రోగులను సృష్టించి మరీ.. సేవలు అందించినట్లు రికార్డులకు ఎక్కించారు.

అలా ఐఎంఎస్ లో ఒక్కో వైద్య శిబిరానికి అయిన ఖర్చును రూ.30 లక్షల నుంచి రూ.35లక్షలుగా లెక్కగట్టారు. నకిలీ బిల్లులు సృష్టించారు. ఒక్కో శిబిరం పేరుతో కనీసం రూ.25 లక్షలను దారి మళ్లించి పంచుకునే వారని దర్యాప్తులో తేలింది.

వైద్య శిబిరాలకు అంటూ పరీక్షల కిట్లను జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి తీసుకొని మార్గమధ్యంలోనే దారి మళ్లించారని తేలింది. హెల్త్ సెంటర్ లకు తరలించి అమ్ముకున్నారని తేలింది.

ఇక కార్మికుల రక్త నమూనాలు సేకరించి వారికి రిపోర్టులు ఇచ్చేవారు కాదు. అసలు పరీక్షలే చేయకుండా కిట్లను ఇతరులకు అమ్ముకునేవారని తేలింది. మందులు ఇస్తున్నట్టు రికార్డులు సృష్టించి వాటిని ఐఎంఎస్ లోని గ్యాంగ్ పక్కదారి పట్టించిందని తేలింది. మందులు లేవని.. బయట కొనాలని రోగులను పంపించేవారు. ఇలా ఐఎంఎస్ లో భారీ కుంభకోణం ఇప్పుడు కలకలం రేపుతోంది.


× RELATED డేటింగ్ చేయాలని యువతకు లీవ్స్
×