కేజీఎఫ్-2 అప్డేట్.. దర్శకుడి షాకింగ్ డెసిషన్?

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీస్ లో ముందు వరసలో ఉంది ‘కేజీఎఫ్ చాప్టర్-2’. కన్నడ రాకింగ్ స్టార్ యష్.. ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మొదటి పార్టు.. భారీ విజయాన్ని అందుకోవడంతో.. సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేటయ్యింది. ఈ విషయాన్ని టీజర్ వ్యూసే చెప్పేశాయి.

మొదటి పార్టు కన్నా.. చాప్టర్-2 లో యాక్షన్ రీ-సౌండ్ అద్దిరిపోతుందని టీజర్ తోనే ప్రకటించాడు దర్శకుడు. యూట్యూబ్ లో వ్యూస్ తోపాటు లైక్స్ కామెంట్ల  విషయంలో నెవ్వర్ బిఫోర్ రికార్డులను సెట్ చేసిందీ టీజర్. దీంతో.. ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే.. ఆ మధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.

దర్శకుడు ప్రశాంత్ నీల్ అటు ‘సలార్’ షూట్ కొనసాగిస్తూనే.. ఇటు కేజీఎఫ్-2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నాడు. అయితే.. ఇప్పుడు ఊహించని అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే రీ-షూట్ విషయం. ఈ చిత్రంలో ఒక భారీ యాక్షన్ సన్నివేశం అనుకున్నంత బాగా రాలేదని దీంతో.. మళ్లీ చిత్రీకరించడానికి దర్శకుడు సిద్ధమయ్యాడనే పుకారు ప్రచారం అవుతోంది.

ఇందులో నిజం ఎంత అనేది తెలియదుగానీ.. ఈ న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతోంది. కరోనా నేపథ్యంలో సినిమాలు వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నందున్న ఈ సమయాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×