సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో మెగాపవర్ స్టార్..!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను రాంచరణ్ బాలన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్.. ఆచార్యలో సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటించడంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే ఆర్ఆర్ఆర్ ఆచార్య రెండు సినిమా తుదిదశలోనే ఉండటం విశేషం. అయితే రాజమౌళి సినిమాలో యాక్షన్ ఏ రేంజిలో ఉండబోతుందో అందరికి తెలిసిందే.

కానీ కొరటాల సినిమాలో రాంచరణ్ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఆచార్యలో రాంచరణ్ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసారట మేకర్స్. ఇంతవరకు చూడని యాక్షన్ సన్నివేశాలలో చరణ్ కనిపిస్తాడని టాక్. కొరటాల సినిమా అంటేనే ఫైట్స్ యాక్షన్ చాలా స్టైలిష్ అండ్ కూల్ గా ఉంటాయి. మరి అలాంటి డైరెక్టర్ నుండి మల్టీస్టారర్ వస్తుందంటే ఇంకా చెప్పే అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఓ కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మే 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాజల్ అగర్వాల్ పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా సరైన సమయానికి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
× RELATED అత్యధిక టీఆర్పీ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..!
×