దిల్ రాజుకు కరోనా.. కంగారులో సెలబ్రిటీలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజురోజుకి కరోనా భయం పెరిగిపోతుంది. ఓవైపు సామాన్యులు ప్రతిరోజూ లక్షల్లో.. మరోవైపు పదుల సంఖ్యలో సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటం ప్రేక్షకులలో ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అసలు కంట్రోల్ చేయలేని రేంజిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా వకీల్ సాబ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కరోనా బారినపడ్డాడు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా విడుదలై థియేటర్లలో కనకవర్షం కురిపిస్తోంది. అటు ఫస్ట్ డే నుండి అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది.

అయితే వకీల్ సాబ్ సినిమా హిట్ అవ్వడంతో దిల్ రాజు ఆనందం పట్టలేక థియేటర్లలో ప్రేక్షకులతో మమేకమై వాళ్లతో మాట్లాడి దగ్గరగా మూవ్ అవ్వడం వలన ఈరోజు ఆయనే క్వారంటైన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ తో సినిమా డ్రీమ్ నెరవేరిందనే ఆలోచనలో వకీల్ సాబ్ విడుదలకు ముందు కూడా ప్రీ-రిలీజ్ వేడుకలో హల్చల్ చేసాడు. ముఖ్యంగా బయట ప్రోగ్రాంలలో అందరితో కలిసి మాట్లాడటం కలవడం లాంటివి చేయడంతో సరిగ్గా మాస్క్ ధరించకపోవడం కూడా దిల్ రాజుకు కరోనా రావడానికి కారణం అయ్యుంటుంది అని టాక్. ప్రస్తుతం దిల్ రాజుకు పాజిటివ్ రావడంతో వకీల్ సాబ్ బృందం కంగారు పడుతోంది. అలాగే ఆయనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే హీరోయిన్ నివేదా థామస్ కూడా కరోనా నుండి కోలుకొని సినిమా థియేటర్ కు వెళ్ళింది. ఇదిలా ప్రస్తుతం దిల్ రాజు చేతిలో అరడజను సినిమాలున్నట్లు సమాచారం.


× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×