మోడీ అండ్ కోకు పాత రోజుల్ని గుర్తు చేసిన పీకే

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. టైమ్లీగా స్పందించటం రాజకీయాల్లో చాలా అవసరం. ఎన్నికల వ్యూహకర్తగా ఒక్కసారి ఒప్పుకుంటే.. సదరు పార్టీని అధికార పీఠం మీద కూర్చోబెట్టే వరకు.. వెనక్కి తగ్గకుండా పని చేయటం.. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనటం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అలియాస్ పీకే. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ అధికారపక్షమైన టీఎంసీ తరఫున.. తమిళనాడులో విపక్ష డీఎంకేకు సలహాల్ని అందిస్తున్నారు. ఎనిమిది దశల్లో సా..గుతున్న బెంగాల్ పోలింగ్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాల్లొ ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు.. నేతలు పోలీసుల కాల్పుల్లో మరణించటం తెలిసిందే. కోచ్ బిహార్ లో చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు పీకే. అదే సమయంలో మమత ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. మమత ఎలాంటి తప్పులు చేయలేదని.. తప్పులు జరుగుతున్నాయి కాబట్టి.. తాను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.

పోలీసులు కాల్పులు జరిగిన ప్రాంతంలో బాధితుల్నిపరామర్శించేందుకు సీఎంవటంతోఆ మమత వెళ్లాలనుకోవటం.. అందుకు అక్కడి అధికారులు ఒప్పుకోకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో నేరుగా సీన్లోకి వచ్చిన ఆయన నోటి నుంచి ఊహించని పోలికను తీసుకొచ్చారు. 2014లో పాట్నాలో జరిగిన ర్యాలీలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని.. ఆ మరుసటి రోజే.. ప్రధాని మోడీ బాధితుల్ని కలిశారన్నారు. అప్పుడు మోడీపై ఎన్నికల కమిషన్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు.

మోడీ విషయంలో నాటి ఈసీ ఎలాంటి అభ్యంతరాలుపెట్టనప్పుడు.. ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పనిలో పనిగా ప్రధాని మోడీపైనా కితాబులు ఇచ్చేశారు. ప్రధాని మోడీ ప్రజలు మెచ్చిన నేత అని.. అందుకే ఆయన ప్రధాని పదవిలో ఉన్నారన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఎప్పుడూ తక్కువగా వేయొద్దని.. అందుకే తాను కూడా తక్కువగా అంచనా వేయనని పేర్కొన్నారు. పీకే మాటల్ని విన్నప్పుడు.. ఆయన విజయరహస్యం ఇదేనని చెప్పక తప్పదు.
× RELATED డేటింగ్ చేయాలని యువతకు లీవ్స్
×