అమితాబ్ అయినా కమల్ హాసన్ అయినా వైబ్స్ ఒకటే!

బాహుబలి ముందు బాహుబలి తర్వాత ఇండస్ట్రీలు మారిన వైనం తెలిసిందే. ప్రచార స్ట్రాటజీతో పాటు మార్కెటింగ్ విధానం చాలా మారింది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా పాన్ ఇండియా అంటూ ప్రస్థావిస్తున్నారు. ఏ సినిమా తీసినా కానీ దానిని అన్ని భాషల్లో మార్కెట్ చేసుకునే విధానం మారింది. నిజానికి పాన్ ఇండియా అనేది ఇప్పుడే పుట్టినది కాదని రానా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

వాస్తవంగా బాహుబలి కి ముందు కంటెంట్ బాహుబలి తర్వాత కంటెంట్ ఒకటేనని ఆయన మణిరత్నం వంటి దిగ్గజాల సినిమాల్ని ఉదహరించారు. అమితాబ్ బచ్చన్ సర్ అయినా కమల్ హాసన్ సర్ అయినా కానీ నాకు ఒకటే.. ఉత్తరాది దక్షిణాది అనే విభేధం లేకుండా నేను సినిమాలు చూస్తానని రానా అన్నారు. భాష సంస్కృతి ఉప్పుడూ సినిమాకి అడ్డంకి కానే కాదని ఆయన అన్నారు.

అయితే ఇటీవల ప్రేక్షకుడి ధృక్పథం మరింత బావుంది. అలాగే సినిమాని మార్కెట్ చేసే విధానం ఎలానో బాహుబలి నేర్పింది. ఆ తర్వాత దానిని అందరూ అనుసరిస్తున్నారు. అదొక ట్రెండ్ అని వివరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా అమరికలో వ్యాపారాన్ని సరైన పద్ధతిలోకి మార్చే మార్గాన్ని బాహుబలి చూపించిందని ఆయన ఘంటాపథంగా చెప్పారు.

నేను ఒక నటుడిగా కంటే ముందు ప్రేక్షకుడిని. నేను హిందీ చిత్రం చూస్తున్నానా లేదా తెలుగు చిత్రం చూస్తున్నానా? అన్నది చూడను. హైదరాబాదీని నేను. నాకు అమితాబ్ బచ్చన్ సార్ చిత్రం లేదా కమల్ హాసన్ చిత్రమైనా వైబ్స్ ఒకటే అని అన్నారు. మణిరత్నం సర్ రోజా తమిళంలో ఆడింది. ఇతర దక్షిణాది భాషల్లో హిందీలోనూ మెప్పించింది. దానికి భాష సంస్కృతితో సమస్య లేదు అని అన్నారు.

మన తెలుగు సినిమాల్ని ఇరుగు పొరుగున అనువాదాల రూపంలో చూస్తున్నారని ఓటీటీలు వచ్చాక అన్ని భాషల చిత్రాల్ని అందరూ ఆదరిస్తున్నారని భాషా భేధం లేదని కూడా రానా అన్నారు. ఇది అందరి మార్కెట్ ని పెంచే సీజన్ అని కూడా అభిప్రాయపడ్డారు. అన్ని భాషల్లోనూ బిజినెస్ చేస్తున్నామని కూడా తెలిపారు.

రానా నటించిన అరణ్య తమిళంలో కదన్ గా రిలీజైంది. ఈ చిత్రం హాతి మేరే సాతి పేరుతో హిందీలో రిలీజ్ కావాల్సి ఉన్నా కోవిడ్ వల్ల వాయిదా పడిన సంగతి  తెలిసిందే.
× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×