ఓటిటి విడుదలకు స్టార్ హీరోయిన్ స్పెషల్ మూవీ..!

స్టార్ హీరోయిన్ త్రిష కొన్నేళ్లుగా సినిమాలలో స్పీడ్ తగ్గించింది. ఇదివరకు చకచకా సంవత్సరానికి రెండు సినిమాలైనా విడుదల సిద్ధం చేసేది త్రిష. కానీ ఇప్పుడు ఏడాదికి ఒకటి కూడా రిలీజ్ చేయడం అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగానే ఉందట. అయితే తాజాగా త్రిష నటించిన 'పరమపాదం విలయట్టు' సినిమా విడుదలకు సిద్ధమైంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలోనే విడుదల కావాల్సింది. కానీ ఏవో కారణాల వలన సినిమా వాయిదా పడింది. కానీ స్పెషల్ డే రోజున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 14న తమిళ కొత్త సంవత్సరం సందర్బంగా 'పరమపాదం విలయట్టు' సినిమాను డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారు.

అంటే ఏప్రిల్ 14 నుండి త్రిష అభిమానులు ఈ సినిమాను హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేయవచ్చు. ఈ పొలిటికల్ డ్రామా నిజజీవిత సంఘటనల ఆధారంగా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో త్రిష ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడికి వైద్యం చేసేందుకు నియమించబడిన లేడీ డాక్టర్ పాత్రలో నటించింది. అంతేగాక ఆ పొలిటిషన్ ముఖ్యమంత్రి అని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు తిరుజ్ఞానం దర్శకత్వం వహించగా.. 24 హెచ్ఆర్ఎస్ ప్రొడక్షన్స్ బ్యాంక్రోల్ చేశారు. నిజానికి 'పరమపాదం విలయట్టు' మూవీ త్రిష కెరీర్లో స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే ఆమె కెరీర్లో 60వ సినిమా ఇది. అమ్రేష్ గణేష్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
× RELATED నేను బతికే ఉన్నా.. ఇంట్లోనే ఉన్నా
×