ఆచార్యః ‘లాహే.. లాహే..’ వెనుక సీక్రెట్ విప్పిన సింగర్!

మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ ఆచార్య. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ చిత్రన్ని సమ్మర్ బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. మే 13న స్లాట్ బుక్ చేసిన మేకర్స్.. సినిమాను సిద్ధం చేస్తున్నారు.

కాగా.. ఈ మధ్య రిలీజ్ అయిన ఆచార్య సింగిల్ ‘లాహే.. లాహే..’ కేక పెట్టిస్తోంది. యూట్యూబ్ లో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ క్యాచ్ చేసిందో తెలిసిందే. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ పాట అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

అయితే.. ఈ పాటను అందరూ హమ్ చేస్తున్నప్పటికీ.. సింగర్స్ ఎవరన్నది మాత్రం పెద్దగా తెలియదు. మరి ఈ పాటను అద్భుతంగా ఆలపించింది ఎవరంటే.. సింగర్స్ హారిక నారాయణ్ సాహితి చాగంటి. ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింగర్స్.

ఈ సందర్భంగా.. ఈ సాంగ్ వెనకున్న సీక్రెట్ గురించి కూడా చెప్పారు. ‘లాహే లాహే..’ పాడుతున్న సమయంలో ఈ పాట మెగాస్టార్ ‘ఆచార్య’ కోసమన్న సంగతే వారికి తెలియదట. ఆ పాట పూర్తయిన తర్వాతే వారికి విషయం తెలిసిందట. మెగాస్టార్ సినిమాకు పాడామని తెలిసి ఎంతో సంతోషించారట. ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలకు పాడిన హారిక సాహితి.. తమదైన గాత్రంతో శ్రోతల హృదయాలను  కొల్లగొడుతున్నారు.
× RELATED నేను బతికే ఉన్నా.. ఇంట్లోనే ఉన్నా
×