బిగ్ అప్డేట్: కొరటాలతో '#NTR30'.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అప్పుడెప్పుడో అధికారికంగా ప్రకటించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందని.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ లేదా బుచ్చిబాబు దర్శకత్వంలో ఉంటుందని అనుకున్నారు. మరో రెండు వారాల్లో ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటుండగా.. అనూహ్యంగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలు రావడంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా '#NTR30' కి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చి అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పటి వరకు వస్తున్న వార్తలను నిజం చేస్తూ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ తదుపరి సినిమాని ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని తెలిపారు. అంతేకాకుండా '#NTR30' చిత్రాన్ని వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 29న విడుదల చేస్తామని అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం గమనార్హం. ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో ఇంతకముందు వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ వీరి కలయికలో సినిమా రాబోతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొరటాల శివ ట్వీట్ చేస్తూ.. మళ్ళీ తారక్ తో కలుస్తున్నందుకు హ్యాపీగా ఉందని.. లాస్ట్ టైం రిపైర్స్ లోకల్ గా చేశామని.. ఈసారి బౌండరీస్ దాటిద్దామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×