ఇస్మార్ట్ హీరోతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా..!

యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ అంటే ఇదివరకు పరిచయం లేదేమోగాని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుదీప్ అంటే జాతిరత్నం అనే గుర్తుపడతారు. అనుదీప్ డెబ్యూ చేసిన 'పిట్టగోడ' సినిమా అసలు ఎప్పుడు వచ్చిపోయిందో తెలియలేదు. కానీ సెకండ్ మూవీ 'జాతిరత్నాలు'తో మాత్రం అనుదీప్ తన పేరు అందరికి తెలిసేలా చేసాడు. ఎందుకంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ అలాంటిది. నవీన్ పొలిశెట్టి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిలను ప్రధానపాత్రలలో పెట్టి తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ జాతిరత్నాలు. ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అందుకుంది. పెట్టిన బడ్జెట్ కు మూడింతల లాభం తెచ్చిపెట్టిందట. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ కామెడీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ చేసింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా అనుదీప్ తదుపరి సినిమా ఏంటి.. ఎవరితో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ తదుపరి సినిమా మాత్రం మాంచి మాస్ సినిమా తీయనున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ అనుదీప్ టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనిని కలిసి స్టోరీ లైన్ వినిపించినట్లు టాక్. అనుదీప్ చెప్పిన స్టోరీకి రామ్ కూడా అనుకూలంగా స్పందించి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలనీ కోరినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను స్రవంతి మూవీస్ తో పాటు వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరి అనుదీప్ సినిమా పై క్లారిటీ రావాల్సి ఉంది.
× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×