జగన్ ప్రధాని అవుతారు పార్థసారధి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఏపీలో 2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజా సంక్షేమమే ద్యేయంగా పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాసీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఏపీలో జగన్ అమల్లోకి తీసుకువచ్చిన అద్భుత పథకాల్లో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఒకటి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అర్హులైన వారి ఇంటి ముందుకు తీసుకుపోతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి చేపట్టింది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేశారు. . సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తుస్తున్నారు. ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోందని ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం అందిస్తామని వెల్లడించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు మనసారా సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. వలంటీర్లలో ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ తో పోరాటంలో వలంటీర్ల పాత్ర ఎనలేనిదని కితాబిచ్చారు. వలంటీర్ల తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని రాష్ట్రంలో పరిపాలన అంటే ఏమిటో చూపించామని సీఎం జగన్

ఇదిలా ఉంటే ..  పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే  పార్థసారధి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతారని ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతున్న చాలా పథకాల్ని చూసి దేశం మొత్తం జగన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారు అని చెప్పారు. రాష్ట్రంలోని పేద వాళ్లకి సీఎం జగన్ స్వర్గం చూపిస్తున్నారని తనకెంతో మంది చెప్పారని ఎమ్మెల్యే  పార్థసారధి అన్నారు. ఎమ్మెల్యే  పార్థసారధి అలా మాట్లాడుతుంటే .. సీఎం జగన్ చిరునవ్వులు చిందింస్తూ కనిపించారు. ఇక ఆ సభకి హాజరైన వాలంటీర్లు అరుపులతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్ వైపు  సీఎం జగన్ నడిపిస్తున్నారని దేశంలో ఎంతో మంది నేతలు వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్నారని ప్రధాని మోదీ కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి దేశం యావత్తూ ఏపీ వైపు చూస్తోందన్నారు.
× RELATED కరోనా కారణంగా నెలలోనే నిరుద్యోగులుగా మారిన 70 లక్షల మంది !
×