శశికళ రాజకీయ సన్యాసం వెనుక బీజేపీ ఉందా?

తమిళనాట అధికారాన్ని .. ఆధిపత్యాన్ని చెలాయించడానికి బీజేపీ ఎత్తులు వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.. అధికార అన్నాడీఎంకే ఓట్లు చీల్చకూడదనే చిన్నమ్మ శశికళను రాజకీయ సన్యాసం చేయించిందా? ఐశ్వర్యం కావాలో? అధికారం కావాలో అని శశికళను బీజేపీ బెదిరించిందా? అంటే ఔననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు.. ఈ మేరకు తమిళనాట ఇప్పుడు ఇదే ప్రచారం జోరుగా సాగుతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదలై ఊపేద్దామని అనుకుంది. అయితే ఇప్పటికే జయలలిత అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకొని సీఎం అవుదామనుకున్న ఆమెను అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల క్రితం బీజేపీ జైలుకు పంపిన సంగతి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి ఎన్నికల వేళ శశికళను అడ్డుతొలగించుకునేందుకే ఆమెకు రిటైర్ మెంట్ ను బీజేపీ ఇచ్చిందని తమిళనాడు రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళకు అపూర్వ స్వాగతం లభించింది. ఏకంగా ప్రజలు నాయకులు పోటెత్తారు. 200 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు టాక్. దీంతో తమిళనాడులో అన్ని సర్వేల్లో డీఎంకే గెలుపు ఖాయమనుకొని ధీమాగా ఉన్న స్టాలిన్ వర్గం కూడా ఖంగారు పడింది.  ఇక శశికళ వస్తే అన్నాడీఎంకే పని ఖతమే అని సీఎం ఫళని స్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా భావించినట్టు టాక్.  ఇక శశికళ ఉంటే ప్రమాదమని కూడా బీజేపీ తీవ్ర ఆలోచన చేసింది.

అన్నాడీఎంకే రెండు సార్లు అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే ఈసారి ఓటమి ఖాయమని అన్నీ సర్వేల్లో తేలింది. శశికళ వచ్చినా అన్నాడీఎంకేను గెలిపించలేదు సరికదా ఓట్లను చీలుస్తుంది. అందుకే ఈసారికి శశికళను రాజకీయ సన్యాసం చేయించారని తమిళనాట టాక్ నడుస్తోంది.

నిజానికి అమిత్ షా శశికళ ను తిరిగి అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని సూచించినా సీఎం ఫళని స్వామి ఒప్పుకోలేదని.. పన్నీర్ ఒప్పుకున్నా కూడా పార్టీ మొత్తం ఆమె హస్తగతం అవుతుందని.. బలమైన శక్తిగా ఎదుగుతుందని అమిత్ షాకు అన్నాడీఎంకే నేతలు చెప్పారట.. అందుకే ఈసారి ఎలాగూ గెలవదని తెలిసి శశికళ రాజకీయ సన్యాసం ప్రకటించేలా చేశారని ప్రచారం సాగుతోంది.

శశికళ కు భారీ ఆస్తులున్నాయి. దాదాపు 2500 కోట్ల ఆస్తులను ఈడీ జప్తుచేసింది. ఈ క్రమంలోనే ఆస్తులు కావాలంటే చెప్పినట్టు చేయాలని శశికళను బీజేపీ బెదిరించినట్టు టాక్. అందుకే ఇలా శశికళ వైదొలిగి ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు తెలుస్తోంది.
× RELATED గల్లా జయదేవ్ కంపెనీకి హైకోర్టులో రిలీఫ్
×