విశాఖలో మెగా ఐటీ పార్క్.. ఏపీ సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్లోని రహేజా మైండ్స్పేస్ తరహాలో మెగా ఐటీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నామని.. ఇందుకోసం విశాఖపట్నంలో స్థలం అన్వేషిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు.  ఐటీ పార్క్ కోసం పోర్ట్ సిటీలోని మిలీనియం టవర్ దగ్గర ఏదైనా స్థలాన్ని అంచనా వేయాలని గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

"ఐటి పరిశ్రమ  భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగల రంగమని అని గౌతం రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో కేవలం తొమ్మిది ఎకరాల భూమిలో ఉన్న మైండ్స్పేస్ కాంప్లెక్స్ అనేక కంపెనీలను కలిగి ఉందని..  వేలాది ఉద్యోగాలను ఇక్కడి ప్రాంతం అందిస్తుందని తెలిపారు.

  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో దీనిపై చర్చించామని..'ఐటి ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడు ఒంటరిగా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఇష్టపడలేదని శాశ్వత ఉపాధి వైపు ఆలోచించాలని సూచించారని మంత్రి మేకపాటి అన్నారు.'.

యువతకు  పెద్ద ఎత్తున ఐటి ఉద్యోగాల కల్పనను సులభతరం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని   విశాఖపట్నంలో ఐటి పార్క్ ఏర్పాటుతో సాధ్యమైనంత ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని మంత్రి అన్నారు.

అనేక పెద్ద ఐటి కార్యాలయాలు విశాఖలో పెట్టేందుకు రెడీగా ఉన్నారని..  బిపిఓ సంస్థ 8000 ఉద్యోగాలతో ముందుకు వచ్చిందని ఐటీ మంత్రి చెప్పుకొచ్చారు.    "రాబోయే రోజుల్లో ఐటి రంగంపై మా దృష్టిని తీవ్రతరం చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం దృష్టి కేంద్రీకరిస్తే ప్రస్తుత పరిస్థితులను తగిన అవకాశాలకు మలచుకోవచ్చు" అని ఆయన అన్నారు.

బహుళ ప్రభుత్వ విభాగాలకు వివిధ సేవలను అందించే ఏకైక రంగం ఐటి మాత్రమేనని మంత్రి తెలిపారు.  ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కాబోతున్నాయని..  వైజాగ్లో కార్యనిర్వాహక రాజధాని అమరావతిలో శాసన రాజధాని కర్నూలులోని న్యాయ రాజధానిగా మూడుగా విభజించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినందున వైజాగ్ త్వరలో దక్షిణాది రాష్ట్ర ఐటీ కార్యనిర్వాహక రాజధానిగా అవతరిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
× RELATED బలాలన్ని బలహీనతలవుతున్నాయ్.. దీన్నే కాలమహిమ అంటారు మోడీజీ
×