క్రికెట్ కు ప్రముఖ క్రికెటర్ గుడ్ బై

టీమిండియా ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.  తనకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ బరోడా క్రికెట్ అసోసియేషన్ కు పఠాన్ ధన్యవాదాలు తెలిపాడు. అండగా నిలుస్తూ ప్రేమను పంచిన నా దేశానికి కుటుంబానికి స్నేహితులు అభిమానులు కోచ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నా కెరీర్ లో ఎదురైన అన్ని పరిస్థితులకు అండగా నిలిచిన నా సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కు కృతజ్ఞతలు తెలిపాడు పఠాన్.  

టీమిండియా తరుఫున 57 వన్డేలు 22 టీట్వీంటులు యూసుఫ్ పఠాన్ ఆడాడు. భారీ హిట్టర్ గా పేరొందిన ఈ బరోడా ఆటగాడు ఐపీఎల్ -2010లో ముంబైపై 37 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

2007 టీ20 ప్రపంచకప్ 2011 వన్డే ప్రపంచకప్ లు గెలవడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్ కు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన రిటైర్ మెంట్ ప్రకటించాడు.

తొలిసారి టీమిండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని యూసుఫ్ పఠాన్ తెలిపాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను భుజాలపై మోయడం తన కెరీర్ లోనే గొప్ప క్షణాలు అన్నాడు.
× RELATED తొందరలోనే మరో టీకా వచ్చేస్తోంది
×